- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భవిష్యత్తును చూడాలనుకునేవారు 'భారత్‌కు రండి': అమెరికా రాయబారి
దిశ, నేషనల్ బ్యూరో: భారత అభివృద్ధి ప్రయాణం గురించి అమెరికా రాయబారి ఎరిక్ గార్సెటీ ప్రశంసించారు. ప్రపంచ భవిష్యత్తు విషయంలో భారత్ కీలకంగా ఉందన్నారు. ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన ఎరిక్, 'మీరు భవిష్యత్తును చూడాలనుకుంటే, భవిష్యత్తు కోసం పనిచేయాలనుకుంటే భారత్‌కు రండి. ఇక్కడ అమెరికా దౌత్య కార్యాలయానికి బాధ్యత వహించే అవకాశం లభించడం పట్ల ఎంతో గర్వంగా ఉన్నాను. భారత్‌తో ఉన్న భాగస్వామ్యాన్ని అమెరికా ఎంతో విలువ ఇస్తుంది. తాము ఇక్కడికి బోధించేందుకు రాలేదు, నేర్చుకోవడానికి వచ్చామన్నారు. ఇదే సందర్భంలో యూఎస్ జాతీయ భద్రతా సలహాదారు జేక్ సుల్లివన్ కూడా భారత్‌తో ఉన్న సంబంధాలను ప్రశంసించారు. ఇరు దేశాల భాగస్వామ్యం "కొత్త శిఖరాలకు చేరిందీ అన్నారు. సాంకేతికతతో పాటు భద్రత, ఇతర రంగాల్లో ఇరు దేశాల మధ్య సహకారం కొనసాగుతోందని తెలిపారు. గతేడాది నవంబర్‌లో అమెరికా గడ్డపై ఖలిస్తానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్ హత్య కుట్ర కేసులో నిఖిల్ గుప్తా అనే భారతీయుడిపై అమెరికా న్యాయవాదులు అభియోగాలు మోపిన తర్వాత ఇరు దేశాల మధ్య సంబంధాలు ఇటీవలి కాలంలో చర్చనీయాంశమయ్యాయి. ఈ నేపథ్యంలో జేక్ సుల్లివన్ వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది.