- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తప్పు తెలుసుకున్నాడు.. అతడిని వదిలిపెట్టండి: మూత్ర విసర్జన బాధితుడి వినతి
దిశ, వెబ్ డెస్క్: మధ్యప్రదేశ్ లోని సిద్ధీ జిల్లాలో దశ్మత్ రావత్ అనే గిరిజనుడిపై ప్రవేశ్ శుక్లా అనే వ్యక్తి బహిరంగంగా మూత్ర విసర్జన చేసిని విషయం తెలిసిందే. ఇక దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా స్పందించిన సిద్ధి జిల్లాకు చెందిన పోలీసులు ప్రవేశ్ శుక్లాను అరెస్ట్ చేశారు. కాగా ఈ ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. నిందితుడిని కఠినంగా శిక్షించాలంట పలు పార్టీలు, దళిత, గిరిజన సంఘాలు డిమాండ్ చేశాయి. ఈ క్రమంలోనే మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ బాధితుడు దశ్మత్ రావత్ ను తన అధికార నివాసానికి తీసుకెళ్లి ఆయన కాళ్లు కడిగారు.
అనంతరం ఆ నీళ్లను ఆయన తలపై చల్లుకున్న సీఎం.. రావత్ కు క్షమాపణ చెప్పారు. కాగా తాజాగా బాధితుడు దశ్మత్ రావత్ ఈ ఘటనపై మాట్లాడారు. నిందితుడు తాను చేసిన పనికి సిగ్గుపడుతున్నాడని, తన తప్పు తెలుసుకున్నందున అతడిని రిలీజ్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరాడు. నిందితుడు ప్రవేశ్ శుక్లా తమ గ్రామానికి చెందిన పండిట్ అని, అతడిని వదిలిపెట్టాలని రావత్ కోరాడు.