'పెళ్లయిన 2 గంటలకే ట్రిపుల్ తలాక్'.. కట్నంలో అది ఇవ్వలేదని తలాక్ చెప్పిన వరుడు

by Vinod kumar |
పెళ్లయిన 2 గంటలకే ట్రిపుల్ తలాక్.. కట్నంలో అది ఇవ్వలేదని తలాక్ చెప్పిన వరుడు
X

ఆగ్రా : ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో దారుణం జరిగింది. వరకట్నంలో తనకు కారును ఇవ్వలేదనే కోపంతో వరుడు.. వధువుకు మూడుసార్లు తలాక్ చెప్పాడు. పెళ్లి జరిగిన రెండు గంటల తర్వాత ఈ ఘటన చోటుచేసుకుంది. తలాక్ చెప్పిన తర్వాత వరుడు పెళ్లి మంటపం నుంచి తన పేరెంట్స్‌తో కలిసి కోపంగా వెళ్ళిపోయాడు. దీనిపై వధువు డాలీ సోదరుడు కమ్రాన్ వాసీ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వరుడు ఆసిఫ్‌తో పాటు మరో ఆరుగురిపై శుక్రవారం కేసు నమోదు చేశారు.

పెళ్లి జరిగిన తర్వాత వరుడు ఆసిఫ్‌ పేరెంట్స్ కట్న కానుకలన్నీ చెక్ చేసుకున్నారు. అయితే వాటిలో ఒక కారు మిస్సయ్యింది. దీనిపై వారు వధువు డాలీ పేరెంట్స్‌ను నిలదీశారు. వరుడు ఆసిఫ్‌ తనకు వెంటనే కారును తెచ్చివ్వాలని డిమాండ్ చేశాడు. అయితే ఇప్పటికిప్పుడు కారును తెచ్చివ్వడం కష్టమని వధువు పేరెంట్స్ ఆసిఫ్‌కు చెప్పారు. ఆగ్రహంతో ఊగిపోయిన ఆసిఫ్ వధువుకు ట్రిపుల్ తలాక్ చెప్పి.. తన కుటుంబంతో కలిసి వివాహ వేదిక నుంచి వెళ్లిపోయాడు.

Advertisement

Next Story

Most Viewed