Union Minister Goyal : జర్మనీ మంత్రిని నిలదీసిన కేంద్రమంత్రి గోయల్

by Y. Venkata Narasimha Reddy |
Union Minister Goyal : జర్మనీ మంత్రిని నిలదీసిన కేంద్రమంత్రి గోయల్
X

దిశ, వెబ్ డెస్క్ : జర్మనీ మంత్రి రాబర్ట్ హాబెక్‌(German Minister Robert Haubeck)ను కేంద్రమంత్రి పీయూష్ గోయల్(Union Minister Piyush Goyal) నిలదీసిన ఓ వీడియో వైరల్(The video went viral) అవుతోంది. జర్మనీకి చెందిన హెరెన్నెక్ట్ సంస్థ నుంచి టన్నెల్ బోరింగ్ యంత్రాలను భారత్ కొనుగోలు చేస్తోంది. ఆ సంస్థ వాటిని చైనాలో తయారు చేస్తుండటంతో భారత్‌కు అమ్మకుండా బీజింగ్ అడ్డుకుంటుందని భారత్ భావిస్తోంది. ఇదే విషయాన్ని గోయెల్ ప్రశ్నించగా రాబర్ట్ సమాధానం చెప్పలేక నీళ్ళు నమిలారు. దీంతో మేం జర్మనీ పరికరాలు కొనడం ఆపేయాలా అని గోయెల్ ప్రశ్నించారు.


కేంద్రమంత్రి నిలదీతతో రెండు దేశాల ప్రతినిధులు అవాక్కయ్యారు. జర్మనీ అధికారుల అందించిన సమాచారంతో ఈ విషయాన్ని నేను పరిష్కరిస్తానని జర్మనీ మంత్రి హాబెక్ సర్థిచెప్పారు. న్యూఢిల్లీలో తాజాగా 18వ ఆసియా పసిఫిక్ కాన్ఫరెన్స్ ఆఫ్ జర్మన్ బిజినెస్‌ సదస్సు సందర్భంగా పీయూష్ గోయల్ జర్మనీ మంత్రితో, వారిజర్మనీ మంత్రి బృందంతో మాట్లాడుతూ టన్నెల్ బోరింగ్ మిషనరీ దిగుమతిపై తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. సదస్సులో భారతదేశం, జర్మనీల మధ్య సమ్మేళనాలు ఏఐ స్వీకరణ నుండి సెమీకండక్టర్ల వరకు అపూర్వమైన వృద్ధిని సాధించగలవని పీయూష్ గోయల్ పేర్కొనడం గమనార్హం.

Advertisement

Next Story

Most Viewed