- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మూడు ఏఐ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్‌లను ప్రారంభించనున్న కేంద్ర విద్యాశాఖ మంత్రి
దిశ, నేషనల్ బ్యూరో: దేశీయ ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయం, సుస్థిర నగరాల అభివృద్ధి కోసం కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అక్టోబర్ 15న మూడు ఏఐ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్(సీఓఈ)లను ప్రకటించనున్నారు. మంత్రిత్వ శాఖ ప్రకటన ప్రకారం.. వికసిత్ భారత్ లక్ష్యాలను సాకారం చేసే దిశగా ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ సీఓఈలను పరిశ్రమ వర్గాలు, స్టార్టప్‌లతో కూడిన కన్సార్టియంలోని దిగ్గజ విద్యా సంస్థల ఆధ్వర్యంలో నిర్వహించబడతాయి. ఈ సెంటర్లలో అనేక పరిశోధనలను నిర్వహిస్తారు. అత్యాధునిక అప్లికేషన్‌లను అభివృద్ధి చేయడం ద్వారా ఈ మూడు రంగాల్లో కొత్త టెక్నాలజీ పరిష్కారాలను రూపొందిస్తారు. సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ వల్ల సమర్థవంతమైన ఏఐ వ్యవస్థను ప్రోత్సహించడమే కాకుండా కొన్ని రంగాల్లో నాణ్యమైన మానవ వనరులను పెంపొందించే లక్ష్యంతో తీసుకొస్తున్నట్టు విద్యా శాఖ పేర్కొంది. మేక్ ఏఐ ఇన్ ఇండియా, మే ఏఐ వర్క్ ఫర్ ఇండియా విజన్‌లో భాగంగా ఈ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్‌లను కేంద్రం ప్రభుత్వం గత ఆర్థిక సంవత్సర బడ్జెట్‌లో ప్రకటించింది.