- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కూటమి గురించి కాదు.. ఢిల్లీ అభివృద్ధి గురించి ఆలోచించు: ఢిల్లీ సీఎంపై కేంద్ర మంత్రి అమిత్ షా ఫైర్
దిశ, వెబ్ డెస్క్: ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లుపై పార్లమెంట్ లో చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. కాగా తాజాగా ఈ బిల్లుపై మాట్లాడుతూ కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పై విరుచుకుపడ్డారు. ఢిల్లీ అభివృద్ధిని పక్కనపెట్టి అక్కడి సీఎం కేజ్రీవాల్ కొత్తగా ఏర్పడిన కూటమి గురించి ఆలోచిస్తున్నారని అన్నారు. కూటమి గురించి ఆలోచించడం మానేసి ఢిల్లీ అభివృద్ధిపై దృష్టి పెట్టాలని హితవు పలికారు. ఢిల్లీకి సంబంధించిన ఎలాంటి చట్టాన్నైనా తీసుకొచ్చే అధికారం రాజ్యాంగంలో పొందుపరిచారని, ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని అన్నారు.
ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లుపై ఆప్ తో కలిసి విపక్షాలు రాద్దాంతం చేస్తున్నాయని మండిపడ్డారు. ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వం అవినీతికి పాల్పడుంతోందన్న అమిత్ షా.. ఇండియా కూటమిలోని పార్టీలు కేజ్రీవాల్ కు గుడ్డిగా సపోర్టు చేయవద్దని సూచించారు. ఇక ఇండియా లాంటి ఎన్ని కూటములు వచ్చినా వచ్చే ఎన్నికల్లో మోడీని గెలవడం సాధ్యం కాదన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ భారీ విజయం సాధిస్తుందని, నరేంద్ర మోడీ మూడోసారి ప్రధాని అవుతారని ధీమా వ్యక్తం చేశారు.