కాంగ్రెస్ హయాంలో రూ.12 లక్షల కోట్ల అవినీతి జరిగింది.. అమిత్ షా

by Javid Pasha |
కాంగ్రెస్ హయాంలో రూ.12 లక్షల కోట్ల అవినీతి జరిగింది.. అమిత్ షా
X

దిశ, వెబ్ డెస్క్: కేంద్ర హోంమత్రి అమిత్ షా యూపీఏ ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలోని యూపీఏ పాలనలో రూ.12 లక్షల కోట్ల అవినీతి జరిగిందని అన్నారు. మోడీ ప్రభుత్వం 9 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా హర్యానాలో జరిగిన ఓ కార్యక్రమంలో అమిత్ షా కాంగ్రెస్ పై విరుచుకుపడ్డారు. యూపీఏ పదేళ్ల పాలనతో లక్షల కోట్ల అవినీతి జరిగితే.. మోడీ తొమ్మిదేళ్ల పాలనలో ఒక్క అవినీతి ఆరోపణ కూడా రాలేదని అన్నారు.

కాంగ్రెస్ హయాంలో పాకిస్తాన్ నుంచి భారత్ లోకి టెర్రిరిస్టులు అక్రమంగా చొరబడి ఎంతో మంది సైనికులను పొట్టన పెట్టుకున్నా సోనియా, మన్మోహన్ సింగ్ ఏనాడు స్పందించలేదని అన్నారు. కానీ మోడీ పీఎం అయ్యాక కూడా పాకిస్తాన్ భారత్ పై దాడులు చేయడానికి ప్రయత్నించిందని, కానీ సర్జికల్ స్ట్రైక్స్ తో వారికి తగిన బుద్ది చెప్పామని తెలిపారు. దేశంలో మళ్లీ అధికారంలోకి వచ్చేది బీజేపీయేనని, పీఎం మళ్లీ మోడీయేనని అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు.

Advertisement

Next Story