ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లుపై చర్చ.. హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు

by Javid Pasha |
ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లుపై చర్చ.. హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లును పార్లమెంట్ లో ఆమోదించడానికి కేంద్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ నేపథ్యంలో లోక్ సభలో జరిగిన చర్చలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీకి సంబంధించి ఎలాంటి చట్టాన్ని తీసుకురావడానికి రాజ్యాంగం పార్లమెంట్ కు అధికారాలు ఇచ్చిందని అన్నారు. ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు కూడా స్పష్టం చేసిందని అన్నారు. ఈ విషయాన్ని అనవసరంగా రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లును ప్రవేశపెట్టడానికి అనుమతినివ్వాలని స్పీకర్ ను కోరారు.

Advertisement

Next Story