- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
22న ఆయన్ను అయోధ్యకు తీసుకురావాల్సిందే.. ఇదే ఇప్పుడు బీజేపీ నేతల డిమాండ్..!
దిశ, వెబ్‌డెస్క్: దేశ ప్రజలంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆ కీలక ఘట్టానికి రెండు వారాలే మిగిలి ఉంది. అయోధ్య రామమందిరంలో విగ్రహ ప్రతిష్టపాపన కార్యక్రమాన్ని దేశమంతటా 15 రోజుల పండుగగా జరపాలని కేంద్రం ప్రభుత్వం భావిస్తోంది. ఈ నెల 22న విగ్రహ ప్రతిష్టాపన జరుగనుండగా.. 27వ తేదీ వరకు వేడుకలు జరుగనున్నాయి. ప్రాణప్రతిష్ట రోజున ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు దేశ ప్రజలంతా దీపావళి జరుపుకోవడానికి సిద్ధమయ్యారు. ఈ మహత్తర కార్యక్రమానికి దేశంలోని కీలక రాజకీయ నాయకులే కాకుండా సినీ, క్రీడా రంగానికి చెందిన ప్రముఖులు కూడా హాజరు కాబోతున్నారు. ఈ క్రమంలో బీజేపీ శ్రేణులు ఓ అనూహ్య డిమాండ్ తెరపైకి తీసుకొస్తున్నారు. రామజన్మభూమి ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన బీజేపీ సీనియర్ నేతలు ఎల్‌కే అద్వానీని 22న అయోధ్యకు తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు.
రామమందిరం ప్రారంభోత్సవానికి అద్వానీ తన కళ్లతో చూడాల్సిందేని, ఇది దేశం కోరిక మాత్రమే కాదు.. ప్రపంచంలోని ప్రతి హిందువు కోరిక అని యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిథ్యనాథ్‌కు లేఖలు పంపుతున్నారు. దేశంలో భారతీయ జనతా పార్టీ మనుగడకు, ఈ స్థాయికి చేరుకోవడానికి అటల్ బీహారీ వాజపేయి, ఎల్‌కే అద్వానీ, మురళీ మనోహర్ జోషి ఎంతో కృషి చేశారని సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. మరోవైపు ఎల్‌కే అద్వానీ, మురళీ మనోహర్ జోషీ వచ్చే ఏడాది జనవరిలో జరిగే రామమందిర ప్రారంభోత్సవానికి హాజరుకావడం లేదని శ్రీరామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ తెలిపిన విషయం తెలిసిందే. దీంతో వాళ్లిద్దరినీ తప్పకుండా తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు. మరి దీనిపై బీజేపీ హైకమాడ్ ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.