Unemployment: నిరుద్యోగిత చాలా తగ్గింది.. ఇంకా తగ్గుతుంది : కేంద్ర కార్మిక మంత్రి

by Hajipasha |   ( Updated:2024-07-29 18:18:42.0  )
Unemployment: నిరుద్యోగిత చాలా తగ్గింది.. ఇంకా తగ్గుతుంది : కేంద్ర కార్మిక మంత్రి
X

దిశ, నేషనల్ బ్యూరో : దేశంలో ఉద్యోగ కోతల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ అన్నారు. ప్రస్తుతం నిరుద్యోగిత రేటు 3.2 శాతం మేర ఉందని.. భవిష్యత్తులో అది 3 శాతం కంటే తగ్గుతుందని ఆయన చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర సర్కారు ఉపాధి కల్పనపై ప్రత్యేక ఫోకస్ పెట్టిందన్నారు.

2017-18 నాటికి దేశంలో 6 శాతంగా ఉన్న నిరుద్యోగిత ..మోడీ సర్కారు చొరవ వల్లే ఇప్పటి 3.2 శాతానికి చేరిందని కార్మిక మంత్రి తెలిపారు. దేశ ఉపాధి కల్పనలో శ్రామిక శక్తి భాగస్వామ్యం 2017-18 నాటికి 38 శాతం మేర ఉండగా.. ఇప్పుడది 44 శాతానికి చేరిందన్నారు. పని-జనాభా నిష్పత్తి కూడా 31 శాతం నుంచి 40 శాతానికి పెరిగిందని మన్సుఖ్ మాండవీయ పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed