UN Chief: మోడీ ఉక్రెయిన్‌ పర్యటనతో యుద్ధం ముగుస్తుందేమో

by Shamantha N |
UN Chief: మోడీ ఉక్రెయిన్‌ పర్యటనతో యుద్ధం ముగుస్తుందేమో
X

దిశ, నేషనల్ బ్యూరో: ప్రధాని నరేంద్ర మోడీ ఉక్రెయిన్ పర్యటనపై ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ అధికారి ప్రతినిధి స్టీఫెన్ డుజారిక్ కీలక వ్యాఖ్యలు చేశారు. మోడీ పర్యటనతో యుద్ధం ముగుస్తుందని ఆశిస్తున్నట్లు భావిస్తున్నానని అన్నారు. డుజారిక్ మాట్లాడుతూ.. "చాలా మంది దేశాధినేతలు, ప్రభుత్వాధినేతలు ఉక్రెయిన్ వెళ్లడాన్ని చూశాం. ఈ పర్యటనలన్నీ సంఘర్షనణకు ముగింపు పలుకుతాయని ఆశిస్తున్నాం. జనరల్ అసెంబ్లీ తీర్మానాలు, అంతర్జాతీయ చట్టాలు, ప్రాదేశిక సమగ్రతకు అనుగుణంగా ఘర్షణ ముగిస్తాయని భావిస్తున్నా” అని అన్నారు.

గతంలో తీర్మానాలు ప్రవేశపెట్టిన యూఎన్

జనరల్ అసెంబ్లీలో రష్యా యుద్ధాన్ని ముగించాలని మూడు సార్లు తీర్మానాలు ప్రవేశపెట్టింది. ఉక్రెయిన్ మౌలిక సదుపాయాలపై దాడులను ఆపాలని మరో తీర్మానంలోనూ డిమాండ్ చేసింది. ఈ తీర్మానాలకు భారత్ గైర్హాజరైంది. ఇకపోతే, ఉక్రెయిన్ అధ్యక్షుడితో ప్రధాని మోడీ భేటీ కానున్నారు. ఇటీవలే రష్యా పర్యటనకు వెళ్లిన మోడీ శుక్రవారం ఉక్రెయిన్ లో పర్యటించనున్నారు. నివేదికల ప్రకారం ఇరు దేశాల మధ్య సందేశాలను మోడీ తెలిపనున్నారు.

Advertisement

Next Story

Most Viewed