30 ఏళ్ల తర్వాత తెరుచుకున్న ఉమా భగవతి ఆలయం

by Hajipasha |
30 ఏళ్ల తర్వాత తెరుచుకున్న ఉమా భగవతి ఆలయం
X

దిశ, నేషనల్ బ్యూరో : జమ్మూకశ్మీర్‌‌లోని అనంతనాగ్‌లో ఉన్న ఉమా భగవతి అమ్మవారి ఆలయం 30 ఏళ్ల తర్వాత తెరుచుకుంది. కేంద్రమంత్రి నిత్యానంద్‌ రాయ్‌ సమక్షంలో ఆదివారం ఈ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పునరుద్ధరణ పనుల అనంతరం భక్తుల దర్శనం కోసం ఆలయాన్ని ఆదివారం రోజు తెరిచారు. రాజస్థాన్ నుంచి తెప్పించిన ఉమా దేవి విగ్రహాన్ని ధార్మిక మంత్రోచ్చారణల మధ్య గర్భగుడిలో ప్రతిష్ఠించారు.

ఈ ఆలయం విషయంలో స్థానిక కశ్మీరీ పండిట్లకు సాధ్యమైనంత మేర సాయం చేసేందుకు తాము సిద్ధమని పలువురు ముస్లింలు తెలిపారు. 1990లో కూల్చివేతకు గురైన ఉమా భగవతి అమ్మవారి ఆలయం ఎట్టకేలకు తెరుచుకుందని, ఇది శుభ పరిణామమని కేంద్రమంత్రి నిత్యానంద్‌ రాయ్‌ అన్నారు. ఈ ఆలయం ప్రారంభం కావడంతో కశ్మీరీ పండిట్లలో విశ్వాసం పెరిగిందని పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed