- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Russia: రష్యాపై మరోసారి ఉక్రెయిన్ క్షిపణిదాడి.. ఈ సారి యూకే మిస్సైల్స్
దిశ, నేషనల్ బ్యూరో: రష్యా, ఉక్రెయిన్ యుద్ధం మరింత తీవ్రతరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. లాంగ్ రేంజ్ మిస్సైళ్ల(ఆర్మీ టాక్టికల్ మిస్సైల్ సిస్టమ్)ను రష్యాపై ప్రయోగించడానికి అమెరికా అధ్యక్షుడు బైడెన్ అనుమతి ఇవ్వడమే చర్చనీయాంశమవ్వగా, ఉక్రెయిన్ వాటిని ప్రయోగించింది కూడా. అమెరికా తయారు చేసిన ఆరు మిస్సైళ్లను ప్రయోగించినట్టు రష్యా వెల్లడించింది కూడా. బుధవారం యూకే తయారు చేసిన లాంగ్ రేంజ్ మిస్సైళ్లను రష్యా భూభాగంపై ఉక్రెయిన్ ప్రయోగించినట్టు వార్తలు వచ్చాయి. వాటి శకలాలు పశ్చిమ రష్యాలోని కర్స్క్, మేరినో గ్రామాల్లో పడ్డాయి. దీంతో రష్యా ప్రతీకారదాడికి దిగుతుందనే అనుమానాలతో అమెరికా సహా పలు యూరప్ దేశాలు ఉక్రెయిన్ రాజధానిలోని తమ రాయబార కార్యాలయాలను తాత్కాలికంగా మూసివేస్తూ నిర్ణయం తీసుకున్నాయి. కీవ్ పై రష్యా వైమానికదాడికి దిగొచ్చని నిఘావర్గాల నుంచి సమాచారం అందిందని, అందుకే ముందుజాగ్రత్తగా ఎంబసీ ఆఫీస్‌ను తాత్కాలికంగా మూసివేస్తున్నట్టు అమెరికా పేర్కొంది. ఆ తర్వాత స్పెయిన్, ఇటలీ, గ్రీస్ కూడా ఇదే నిర్ణయం తీసుకున్నాయి. కాగా, బ్రిటన్ మాత్రం తమ ఎంబసీని క్లోజ్ చేయబోమని, ఇక్కడి పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తామని పేర్కొంది. కీవ్‌లో షెల్టర్‌లలో ఉంటున్నవారిని అప్రమత్తంగా ఉండాలని ఉక్రెయిన్ హెచ్చరికలు జారీ చేసింది. కాగా, ఇలాంటి వార్నింగ్‌లు తాము తరుచూ ఇస్తున్నామని, రష్యా దాడి చేయొచ్చనే హెచ్చరికలు వేయి రోజుల క్రితం నుంచి నిత్యం తాము వింటున్నామని తెలిపింది. అయితే, యూకే తయారీ క్షిపణులను ఉపయోగించడంపై ఉక్రెయిన్, యూకేలు అధికారికంగా స్పందించలేదు.