UK YouTuber: భారత్ పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన బ్రిటన్ యూట్యూబర్

by Shamantha N |
UK YouTuber: భారత్ పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన బ్రిటన్ యూట్యూబర్
X

దిశ, నేషనల్ బ్యూరో: భారత్ దేశంపై జాత్యాహంకార వ్యాఖ్యలు చేసిన బ్రిటన్ యూట్యూబర్ మైల్స్ రూట్ లెడ్జ్ పై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. భారత్‌తో పాటు పలు దేశాల గురించి ప్రస్తావిస్తూ తీవ్ర పదజాలం వాడాడు. చిన్నపాటి ఉల్లంఘనకు పాల్పడినా ఆ దేశాలపై అణుబాంబులు వేస్తామంటూ చెత్తవాగుడు వాగాడు. ఇప్పుడు అదంతా జోక్ అని సోషల్ మీడియాతో తెలిపాడు. దీంతో నెటిజన్లు అతడిపై ఫైర్ అవుతున్నారు. ‘‘నేను బ్రిటన్ ప్రధానిని అయ్యాక.. మా దేశ ప్రయోజనాలకు ఆటంకం కలిగించే విదేశాలకు అణుబాంబులతోనే సమాధానం చెప్తానని హెచ్చరిస్తాను. తీవ్ర ఘటనలు జరిగే దాకా చూడను. చిన్నపాటి ఉల్లంఘనలకే ఆ దేశాలపై అణ్వస్త్రాలు ప్రయోగిస్తాను’’ అని సోషల్ మీడియా ఎక్స్ లో తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. ఆ విదేశాల జాబితాలో భారత్‌ పేరును కూడా పేర్కొన్నాడు. భారతదేశం అంటే ఇష్టం లేదని.. జాత్యాహంకార వ్యాఖ్యలు చేశారు." మీరు నమ్మినా, నమ్మకపోయినా.. నాకు భారతదేశం అంటే ఇష్టం లేదు. అలాగే నేను ఒక వ్యక్తి భారతీయుడు ఔనా కాదా అనిని గ్రహించగలను" అని ఎక్స్ లో చెప్పుకొచ్చాడు. దాంతో అతడిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది.

మైల్స్ రూట్ లెడ్జ్ ఎవరంటే?

బ్రిటన్‌కు చెందిన మైల్స్‌ రూట్‌లెడ్జ్‌.. సంక్షోభం నెలకొన్న ప్రాంతాల్లోనే పర్యటిస్తాడు. విపత్తు సమయంలో ఆయా దేశాల ప్రజలు ఎలాంటి జీవన స్థితిగతుల్లో ఉన్నారో చూసి తన అనుభవాలను సోషల్ మీడియాలో చెబుతాడు. 2021, ఆగస్టు 15న అఫ్గానిస్థాన్‌లో తాలిబన్లు అధికారం చేజిక్కించుకున్నప్పుడు మైల్స్ అఫ్గాన్ వెళ్లాడు.బ్రిటన్ ప్రభుత్వం హెచ్చరికలు ఖాతరు చేయకుండా అఫ్గాన్ వెళ్లాడు. తర్వాత అక్కడ చిక్కుకుపోయిన అతడిని ఆగస్టు 17న బ్రిటన్ ఆర్మీ తరలించింది. బుర్ఖా ధరించి ఆ దేశం నుంచి బయటపడ్డాడు. అలాగే అఫ్గాన్ లో ఎదురైన అనుభవాలపై పుస్తకాన్ని కూడా రాశాడు. మైల్స్.. ఒక్క అఫ్గాన్ కే కాదు.. కజకిస్థాన్, ఉగాండా, కెన్యా, దక్షిణ సూడాన్, ఉక్రెయిన్, బ్రెజిల్ సహా ఇలా సవాళ్లను ఎదుర్కొంటున్న ప్రమాదకరమైన ప్రదేశాలకు కూడా వెళ్లాడు.

Advertisement

Next Story

Most Viewed