UGC NET 2024 దరఖాస్తులు ప్రారంభం.. పరీక్ష కేంద్రాలు ఇవే

by Harish |
UGC NET 2024 దరఖాస్తులు ప్రారంభం.. పరీక్ష కేంద్రాలు ఇవే
X

దిశ, నేషనల్ బ్యూరో: యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నేషనల్ ఎలిజిబిలిటి టెస్ట్(UGC NET) 2024(జూన్) పరీక్షకు సంబంధించిన షెడ్యూల్‌ను తాజాగా విడుదల చేశారు. ఏప్రిల్ 20 నుంచి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. చివరి తేదీ మే 10 వరకు ఉంటుంది. దరఖాస్తు ఫీజు: జనరల్ అభ్యర్థులకు రూ.1150, ఈడబ్ల్యూఎస్/ఓబీసీ(నాన్-క్రిమిలేయర్) వారికి రూ.600, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ట్రాన్స్‌జెండర్స్‌కు రూ.325.

పరీక్షను దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కేంద్రాల్లో జూన్ 16న నిర్వహిస్తారు. దీనిలో రెండు పేపర్లు ఉంటాయి. మొత్తం 83 సబ్జెక్టులకు సంబంధించి ఓఎమ్మర్ ఆధారిత పరీక్షను నిర్వహిస్తారు. యూజీసీ నెట్ ద్వారా దేశంలోని యూనివర్సిటీలలో లెక్చరర్‌షిప్ (అసిస్టెంట్ ప్రొఫెసర్), జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్ కోసం పోటీ పడవచ్చు.

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, సికింద్రాబాద్, హయత్‌నగర్, జనగాం, కరీంనగర్, ఖమ్మం, కొత్తగూడెం, మహబూబాబాద్, మహబూబ్ నగర్, మేడ్చల్, నల్గొండ, నిజామాబాద్, సంగారెడ్డి, సిద్ధిపేట, సూర్యాపేట, వరంగల్, అమరావతి, అనంతపురం, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, మచిలీపట్నం, మంగళగిరి, నంద్యాల, శ్రీకాకుళం, సూరంపాలెం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం,నరసరావుపేట, నెల్లూరు, రాజమహేంద్రవరం.

Advertisement

Next Story

Most Viewed