Udhav Thakre: ‘అహ్మద్ షా అబ్దాలీ’ వారసుడే అమిత్ షా..ఉద్ధవ్ థాక్రే సంచలన వ్యాఖ్యలు

by vinod kumar |
Udhav Thakre: ‘అహ్మద్ షా అబ్దాలీ’ వారసుడే అమిత్ షా..ఉద్ధవ్ థాక్రే సంచలన వ్యాఖ్యలు
X

దిశ, నేషనల్ బ్యూరో: శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ థాక్రే కేంద్ర హోం మంత్రి అమిత్ షాపై తీవ్ర విమర్శలు గుప్పించారు. పానిపట్ యుద్ధంలో మరాఠాలను ఓడించిన ఆఫ్ఘన్ పాలకుడు అహ్మద్ షా అబ్దాలీ వారసుడే అమిత్ షా అని ఆరోపించారు. అధికారాన్ని కాపాడుకునేందుకు రాజకీయ పార్టీలను విచ్ఛిన్నం చేసి బీజేపీ ‘పవర్ జిహాద్’లో నిమగ్నమైందని తెలిపారు. శనివారం పూణెలో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఉద్ధవ్ ప్రసంగించారు. ‘ముస్లింలు మాతో ఉంటే, వారికి మా హిందుత్వాన్ని వివరిస్తాం. అప్పుడు మేము ఔరంగజేబ్ అభిమానులం అవుతాం. కానీ మీరు చేస్తున్నది పవర్ జిహాద్’ అని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలోని మహా వికాస్ అఘాడీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తుందని ఫైర్ అయ్యారు. ఉచితాలు ఇవ్వడం ద్వారా ఓటర్లకు లంచాలు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఫైర్ అయ్యారు.

కాగా, ఇటీవల జరిగిన ఓ సమావేశంలో అమిత్ షా మాట్లాడుతూ.. ఉద్దవ్ థాక్రే ఔరంగజేబ్ ఫ్యాన్స్ క్లబ్ నాయకుడు అని అభివర్ణించారు. అంతేగాక ‘ఉద్ధవ్ థాక్రేకు కసబ్ తో సంబంధాలున్నాయి. ఆయన పీఎఫ్ఐకి మద్దతు ఇస్తాడు. ఔరంగాబాద్‌ని శంభాజీ నగర్‌గా పేరు మార్చడాన్ని కూడా వ్యతిరేకిస్తున్నాడు’ అని ఆరోపించారు. ఈ క్రమంలోనే అమిత్ షా వ్యాఖ్యలకు ఉద్ధవ్ తాజాగా కౌంటర్ ఇచ్చారు. అయితే ఉద్ధవ్ వ్యాఖ్యలపై మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ స్పందించారు. ఉద్ధవ్ నిరాశలో ఉన్నాడని, అందుకే ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఆయన ఔరంగా జేబ్ అభిమాని అని తన మాటల్లోనే అర్థమవుతుందని విమర్శించారు.

Advertisement

Next Story

Most Viewed