- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Uddhav thackrey : ‘భయపడకండి.. మీ పేర్లు టీవీల్లో వస్తాయి..’
దిశ, నేషనల్ బ్యూరో : మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల వేళ యావత్మాల్ జిల్లాలో సోమవారం ఉద్దవ్ ఠాక్రే బ్యాగులను ఎన్నికల అధికారులు తనిఖీ చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా బ్యాగులు చెక్ చేయడానికి వేచి ఉన్న అధికారుల పేర్లు చెప్పాలని ఉద్దవ్ ఠాక్రే కోరారు. అనంతరం ఐడీ కార్టులు చూపాలన్నారు. ఈ సందర్భంగా మహేష్ షానీ అనే అధికారి తన బృందంతో తనిఖీలకు రాగా అక్కడున్న అందరూ ఉద్యోగుల పేర్లను ఠాక్రే అడిగి తెలుసుకున్నారు. అపాయింట్‌మెంట్ లెటర్లు చూపాలని వారిని ఉద్దవ్ ఠాక్రే కోరారు. ‘మీకేం కావాలి.. నాకేం ఇబ్బంది లేదు. మీ అందరి పేర్లు టీవీల్లో వస్తాయి.. మీరంతా ఫేమస్ అవుతారు. భయ పడాల్సిన అవసరం లేదు’ అనిని ఉద్దవ్ ఠాక్రే అన్నారు. ఎలక్షన్ కమిషన్ అధికార పార్టీ కూటమి లీడర్ల బ్యాగులను ఎందుకు తనిఖీ చేయడం లేదని ఆయన ప్రశ్నించారు.
ఈ ఘటనపై మంగళవారం సంజయ్ రౌత్ స్పందిస్తూ.. అధికార పార్టీ కూటమి నేతలు, పీఎం మోడీ, హోం మంత్రి అమిత్ షా బ్యాగులను చెక్ చేయాలని డిమాండ్ చేశారు. తమ లగేజ్, హెలికాప్టర్లు, ప్రైవేట్ జెట్ ఫ్లైట్లు, కార్లు, ఇళ్లు అన్నింటిని తనిఖీ చేస్తున్నారని అయితే ఎలాంటి నిష్పక్షపాతం లేకుండా సోదాలు చేస్తే తమకేం ఇబ్బంది లేదన్నారు. సీఎం ఏక్ నాథ్ షిండే, దేవేంద్ర ఫడ్నవీష్, అజిత్ పవార్, మోడీ, షాల హెలికాప్టర్లు ఎందుకు తనిఖీ చేయడం లేదు. డబ్బుల పంపిణీ ఎలక్షన్ అబ్జర్వర్లకు కనిపించడం లేదా? అని ఆయన ప్రశ్నించారు.