ఆయన మమ్మల్ని ఇంటి పని మనుషుల్లా చూశారు : సీఎం

by Hajipasha |
ఆయన మమ్మల్ని ఇంటి పని మనుషుల్లా చూశారు : సీఎం
X

దిశ, నేషనల్ బ్యూరో : శివసేన వ్యవస్థాపకుడు బాలాసాహెబ్ థాక్రే పార్టీ కార్యకర్తలను స్నేహితుల్లా చూసేవారని.. అయితే ఉద్ధవ్ థాక్రే తమను ఇంటి పని మనుషుల్లా చూశారని మహారాష్ట్ర సీఎం, శివసేన (షిండే) చీఫ్ ఏక్‌నాథ్ షిండే ఆరోపించారు. బాల్ థాక్రే సిద్ధాంతాలను ఉద్ధవ్ థాక్రే గాలికి వదులుతుండటాన్ని చూసి తట్టుకోలేకే తాను తిరుగుబాటు చేశానని ఆయన స్పష్టం చేశారు. నాగ్‌పూర్‌లోని రామ్‌టెక్‌లో జరిగిన తన పార్టీ (శివసేన - షిండే) కార్యకర్తల సమావేశంలో షిండే ప్రసంగించారు. తాను ముఖ్యమంత్రి కావాలనుకోలేదని, అయితే బాల్ థాకరే సిద్ధాంతాలకు జీవం పోసే గొప్ప లక్ష్యంతో అనివార్య పరిస్థితుల్లో తిరుగుబాటు చేయాల్సి వచ్చిందన్నారు. నాయకులు ఇంట్లో కూర్చోకుండా కిందిస్థాయి కార్యకర్తలకు చేరువైనప్పుడే పార్టీ అభివృద్ధి చెందుతుందని ఆయన పేర్కొన్నారు. నరేంద్ర మోడీని మూడోసారి ప్రధానిగా చేసేందుకు బీజేపీ సారథ్యంలోని అధికార కూటమికి ఓటు వేయాలని ప్రజలను కోరారు. కాంగ్రెస్ సారథ్యంలోని కూటమికి ఎలాంటి ఎజెండా లేదన్నారు.

Advertisement

Next Story