- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మమ్మల్ని 'అపోజిషన్' అనొద్దు .. కేంద్రాన్నే అనండి : ఉద్ధవ్
ముంబై: "దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ఏకమవుతున్న మా లాంటి రాజకీయ పక్షాలను అపోజిషన్ పార్టీలు అని పిలవకూడదు. వాస్తవానికి ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వానికే అపోజిషన్ అనే పదం అతికినట్టు సరిపోతుంది. ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి బద్ధ వ్యతిరేకులుగా ఉన్నందున కేంద్రాన్నే అపోజిషన్ అనాలి" అని మహారాష్ట్ర మాజీ సీఎం, శివసేన (ఉద్ధవ్) చీఫ్ ఉద్ధవ్ థాక్రే వ్యాఖ్యానించారు. ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్‌లతో కలిసి బుధవారం ముంబైలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన సంయుక్త మీడియా సమావేశంలో ఆయన ఈ కామెంట్స్ చేశారు.
ఢిల్లీ సర్కారు అధికారాలకు కత్తెర వేస్తూ.. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆర్డినెన్స్‌ను అడ్డుకునేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ చేసే పోరాటానికి అన్ని రకాల సహాయ సహకారాలను అందిస్తామని ఉద్ధవ్ వెల్లడించారు. "కేంద్ర ప్రభుత్వ నిరంకుశ ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా పార్లమెంట్‌లో మాకు మద్దతు ఇస్తామని ఉద్ధవ్ ఠాక్రే హామీ ఇచ్చారు. ఈ బిల్లు (ఆర్డినెన్స్) పార్లమెంటులో ఆమోదం పొందకపోతే 2024లో మోడీ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి రాదు" అని కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఈ అంశంలో విపక్ష పార్టీల మద్దతును కూడగట్టడంపై ఫోకస్ చేసిన ఢిల్లీ సీఎం.. మంగళవారం కోల్‌కతాకు వెళ్లి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని కూడా కలిశారు.