India-UAE: గల్ఫ్ దేశంలో అణు విద్యుత్ ప్లాంట్ల నిర్వహణకు భారత్‌తో యూఏఈ ఒప్పందం

by S Gopi |
India-UAE: గల్ఫ్ దేశంలో అణు విద్యుత్ ప్లాంట్ల నిర్వహణకు భారత్‌తో యూఏఈ ఒప్పందం
X

దిశ, నేషనల్ బ్యూరో: పౌర అణుశక్తి సహకారానికి సంబంధించి గల్ఫ్ దేశం యూఏఈ, భారత ప్రభుత్వం మధ్య కీలక ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందంలో భాగంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)లో అణు విద్యుత్ ప్లాంట్ల పరీక్ష, నిర్వహణ కోసం సేవలందించేందుకు భారత్ ఫ్రేమ్‌వర్క్‌ను అందిస్తుంది. ఈ మేరకు న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఎన్‌పీసీఎల్) ఛైర్మన్, ఎండీ భువాన్ చంద్ర పాఠక్, ఎమిరేట్స్ న్యూక్లియర్ ఎనర్జీ కార్పొరేషన్(ఎన్ఈసీ) ఎండీ, సీఈఓ మొహమ్మద్ అల్ హమాది అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు. అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖలీద్ బిన్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ భారత పర్యటనలో భాగంగా ఈ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ద్వారా అణు సాంకేతికతను శాంతియుతంగా ఉపయోగించడంలో సహకారాన్ని పెంచడం, ఇరు దేశాల మధ్య సంబంధాలను మరింతగా పటిష్టం చేయనుంది. ఇది భౌగోళిక రాజకీయాలను ప్రభాతం చేయడమే కాకుండా బాధ్యతాయుతమైన అణుశక్తి దేశంగా భారత్‌కు పెరుగుతున్న ప్రాధాన్యతను సూచిస్తోంది.

Advertisement

Next Story