- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
దద్దరిల్లిన దండకారుణ్యం.. ఇద్దరు నక్సల్స్ మృతి
దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: ఛత్తీస్ గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లాలోని దంతేష్ పురం అటవీ ప్రాంతం సోమవారం తెల్లవారు జామున కాల్పులతో దద్దరిల్లింది. పోలీసులు.. మావోయిస్టులకు మధ్య జరిగిన ఎన్ కౌంటర్లో ఇద్దరు నక్సలైట్లు మృతి చెందారు. వివరాలు ఇలా ఉన్నాయి. గోలాపల్లి ఎల్వోఎస్ కమాండర్ మడ్కమ్ ఎర్రతో పాటు కొందరు మావోయిస్టులు దంతేష్ పూర్ అడవుల్లో ఉన్నట్టు పోలీసులకు ఆదివారం రాత్రి సమాచారం అందింది. ఈ క్రమంలో డీఆర్జీ బృందాలతో పాటు కోబ్రా 202 బెటాలియన్, సీఆర్పిఎఫ్ 219 బెటాలియాన్ బలగాలు వేర్వేరు దారుల్లో మావోయిస్టులను గాలిస్తూ అడవిలోకి వెళ్లాయి.
సెర్చింగ్ చేసి తిరిగి వస్తుండగా తెల్లవారుఝాము 5.30 గంటల సమయంలో మావోయిస్టులు డీఆర్జీ బృందంపై కాల్పులు జరిపారు. దాంతో డీఆర్జీ బలగాలు ఎదురు కాల్పులు జరిపాయి. దీంట్లో ఇద్దరు మావోయిస్టులు చనిపోయారు. మరణించిన వారిని మడ్కమ్ ఎర్ర, మహిళా నక్సల్ పొడియం భీమేగా గుర్తించారు. ఘటనా స్థలం నుంచి పెద్ద సంఖ్యలో ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. మరణించిన మడ్కమ్ ఎర్ర మీద 8 లక్షల రివార్డ్ ఉన్నట్టు పోలీసులు తెలిపారు. మావోయిస్టుల కోసం గాలింపు కొనసాగుతోందని చెప్పారు.