కేరళలో నిఫా అలర్ట్.. మరో ఇద్దరికి ‘నెగెటివ్’

by Hajipasha |
కేరళలో నిఫా అలర్ట్.. మరో ఇద్దరికి ‘నెగెటివ్’
X

దిశ, నేషనల్ బ్యూరో : నిఫా వైరస్ ఇన్ఫెక్షన్‌ సోకి ఈనెల 21న మలప్పురం జిల్లాలో 15 ఏళ్ల బాలుడు చనిపోయిన ఘటనను కేరళ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ఈ ఘటన అనంతరం చనిపోయిన బాలుడి తల్లిదండ్రుల కాంటాక్ట్ లిస్టులోని ప్రతి ఒక్కరిపై జిల్లా వైద్య యంత్రాంగం స్పెషల్ ఫోకస్ పెట్టింది. ప్రస్తుతం 9 మంది నిఫా లక్షణాలతో వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

అయితే వీరికి అధికారికంగా నిఫా పాజిటివ్ నిర్ధారణ కాలేదు. ముందుజాగ్రత్త చర్యగా చనిపోయిన బాలుడి సన్నిహితులందరి బ్లడ్ సీరం శాంపిల్స్‌ను జిల్లా వైద్య యంత్రాంగం సేకరించి టెస్టులకు పంపింది. వారిలో మరో ఇద్దరికి తాజాగా శుక్రవారం రోజు నెగెటివ్ వచ్చింది. దీంతో కాంటాక్టు లిస్టులలో ‘నెగెటివ్’ మెడికల్ రిపోర్టు వచ్చిన వారి సంఖ్య 68కి చేరింది. కాంటాక్ట్ లిస్ట్‌లో మొత్తం 472 మంది ఉండగా.. వారిలో 220 మంది హై- రిస్క్ కేటగిరీలో ఉన్నారు.



Next Story