- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గుజరాత్‌లో రెండు ఆస్ట్రేలియన్ యూనివర్సిటీ క్యాంపస్‌లు.. కేంద్ర మంత్రి కీలక ప్రకటన
న్యూఢిల్లీ: కేంద్ర విద్యాశాఖ మంత్రి దర్మేంద్ర ప్రధాన్ కీలక ప్రకటన చేశారు. ఆస్ట్రేలియాకు చెందిన వోలోంగాంగ్, డీకిన్ యూనివర్సిటీలు గుజరాత్‌లో క్యాంపస్ ఏర్పాటు చేయనున్నట్లు బుధవారం ప్రకటించారు. ఈ మేరకు వచ్చే వారం ఆస్ట్రేలియా ప్రధాని అంథోని అల్బనెసేతో భారత పర్యటనలో ఒప్పందం చేసుకోనున్నట్లు చెప్పారు. ఈ విషయాన్ని ఢిల్లీ యూనివర్సిటీ వెంకటేశ్వర కాలేజిలో ఆస్ట్రేలియా విద్యా శాఖ మంత్రి జాసన్ క్లేర్ సమక్షంలో వెల్లడించారు.
మేము యువతకు స్థోమతలో నాణ్యమైన విద్యను అందించేందుకు ఆస్ట్రేలియాతో భాగస్వామిగా ఉండాలనుకుంటున్నామని చెప్పారు. భారత్, ఆస్ట్రేలియా పరిమాణాలు వేర్వేరుగా ఉన్నప్పటికీ రెండు ఆకాంక్షలు ఒకేలా ఉన్నాయన్నారు. గత 50 సంవత్సరాల నుండి ఆస్ట్రేలియా అభివృద్ధిని తాను నిశితంగా గమనిస్తున్నానని చెప్పారు. యువ దేశంగా భారత్ ఆస్ట్రేలియా సహకారం కోరుకుంటుందని తెలిపారు.