TVK: ప్రశాంత్ కిశోర్ తో టీవీకే అధినేత విజయ్ భేటీ

by Shamantha N |
TVK: ప్రశాంత్ కిశోర్ తో టీవీకే అధినేత విజయ్ భేటీ
X

దిశ, నేషనల్ బ్యూరో: నటుడు, తమిళ వెట్రి కజగం (TVK) అధినేత విజయ్.. జన్ సురాజ్ పార్టీ అధినేత, రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌తో సమావేశమయ్యారు. (Vijay meets Prashant Kishor) కొత్తగా ఏర్పడిన ఆ పార్టీ ఎన్నికల్లో పోటీకి ఆయన సహకరిస్తున్నట్లు వార్తలొచ్చాయి. ఈ భేటీతో తమిళనాడు రాజకీయాలు హాట్ హాట్ గా మారాయి. ఈ భేటీపై తమిళనాడు అధికార డీఎంకేతో సహా విపక్ష పార్టీలు విమర్శించాయి. ఈ భేటీపై తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. విజయ్‌ ఏసీ గదిలో కూర్చుని రాజకీయ వ్యూహకర్త ప్రశాంత కిషోర్‌తో భేటీకి బదులు జనంలోకి వెళ్లి వారిని కలిస్తే బాధలు తెలుస్తాయని చురకలు అంటించారు.

విమర్శలు గుప్పింటిన ఎన్టీకే

కాగా, వ్యూహకర్తలపై ఆధారపడటం ఒక వ్యాధిగా మారిందని నామ్ తమిళర్ కట్చి (NTK) నేత సీమాన్ విమర్శించారు. ‘శరీరంలో కొవ్వు గురించి మీరు విని ఉండవచ్చు. కానీ ఇదిమాత్రేం డబ్బు వల్ల వచ్చిన కొవ్వు’ అని ఎద్దేవా చేశారు. మరోవైపు గతంలో ప్రశాంత్ కిషోర్‌తో కలిసి పని చేసిన అధికార డీఎంకే భిన్నంగా స్పందించింది. ఎన్నికల వ్యూహాల కోసం తమ పార్టీ కార్యకర్తలపై డీఎంకే ఆధారపడుతుందని ఎంపీ కనిమొళి తెలిపారు. ‘ప్రశాంత్ కిషోర్ ఒక ప్రొఫెషనల్ వ్యూహకర్త. ఆయనను ఎవరు పిలిచినా, వారితో కలిసి పనిచేస్తారు. దీనితో మనకు ఏం సంబంధం? డీఎంకే తన పార్టీ కార్యకర్తల బలంతో ఎన్నికలను ఎదుర్కొంటుంది. సీఎం స్టాలిన్ మనకు చూపించే మార్గం నాయకులంతా అనుసరించే మార్గం. మాకు ఎలాంటి సమస్యలు లేవు’ అని ఆమె అన్నారు. ఏఐడీఎంకే (AIADMK) నేత కోవై సత్యన్ టీవీకేని “రాజకీయ స్టార్టప్” అని విమర్శించారు.

Next Story

Most Viewed