కళ్లకురిచి ఘటనపై స్పందించండి..ఖర్గేకు నడ్డా లేఖ

by vinod kumar |
కళ్లకురిచి ఘటనపై స్పందించండి..ఖర్గేకు నడ్డా లేఖ
X

దిశ, నేషనల్ బ్యూరో: తమిళనాడులోని కళ్లుకురిచిలో కల్తీ మద్యం తాగి 57 మందికి పైగా మరణించిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనపై కాంగ్రెస్ పార్టీ స్పందించాలని కోరుతూ ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గేకు కేంద్ర మంత్రి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా లేఖ రాశారు. ఈ అంశంపై కాంగ్రెస్ మౌనం వహిస్తుందని ఆరోపించారు. ఎందుకు దీనిపై స్పందించడం లేదో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. ‘కళ్లకురిచిలో జరిగిన దుర్ఘటన పూర్తిగా మానవ నిర్మిత విపత్తు. అధికార డీఎంకే-ఇండియా కూటమి పాలనకు, అక్రమ మద్యం మాఫియాకు మధ్య లోతైన బంధం లేకుంటే 57 మంది ప్రాణాలు కాపాడి ఉండేవాళ్లం’ అని లేఖలో పేర్కొన్నారు. ‘ఇంత భారీ విపత్తు జరిగినప్పుడు, మీ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ మౌనం వహించడం షాక్‌కు గురిచేసింది. కాబట్టి దీనిపై మాట్లాడండి. బాధితులకు అండగా నిలవండి’ అని తెలిపారు. కాగా, సోమవారం అధికారులు విడుదల చేసిన తాజా సమాచారం ప్రకారం తమిళనాడులో కల్తీ మద్యం తాగి మరణించిన వారి సంఖ్య 57కి చేరింది. అలాగే రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ ఆసుపత్రుల్లో 156 మంది చికిత్స పొందుతున్నారు.

Advertisement

Next Story