USA Deportation :18వేల మంది భారతీయులకు ట్రంప్ షాక్

by Sathputhe Rajesh |   ( Updated:2024-12-13 11:02:00.0  )
USA Deportation :18వేల మంది భారతీయులకు ట్రంప్ షాక్
X

దిశ, నేషనల్ బ్యూరో : ఇటీవల అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్ 18వేల మంది భారతీయులకు షాక్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. సరైన పత్రాలు లేని కారణంగా వారందరిని భారత్‌కు తిప్పి పంపాలని అమెరికా భావిస్తోంది. ఎన్నికల హామీలో భాగంగా అమెరికా దేశ చరిత్రలో తొలి సారి అతి పెద్ద డిపోర్టేషన్(బహిష్కరణ)కు రంగం సిద్ధమవుతోంది. వచ్చే ఏడాది జనవరి 20న ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఈ డిపోర్టేషన్ అమలు కానుంది. ఇప్పటికే యూఎస్ ఇమిగ్రేషన్ మరియు కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ దేశంగా అక్రమంగా ఉంటున్న 15 లక్షల మంది బహిష్కరణకు సంబంధించి జాబితాను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.

తాజాగా యూఎస్ అధికారులు సిద్ధం చేసిన డిపోర్టేషన్ జాబితాలో 17,940 మంది భారతీయులను చేర్చారు. యూఎస్‌లో 7లక్షల 25వేల మంది భారతీయులు అక్రమ ఇమిగ్రేషన్ కలిగి ఉన్నట్లు ప్యూ రీసెర్చ్ సెంటర్ డాటా తెలిపింది. అక్టోబర్‌లో ఈ డేటా విడుదలకు ముందు యూఎస్ ప్రత్యేక విమానాన్ని భారత పౌరులను తరలించడానికి ఉపయోగించింది. అక్టోబర్ 22న ఆ విమానం భారత్‌కు చేరినట్లు హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ డిపార్ట్ మెంట్ తెలిపింది. గత మూడేళ్లుగా సుమారు 90వేల మంది యూఎస్ బార్డర్లను దాటేందుకు యత్నించినట్లు తెలుస్తోంది. వేల మంది తమ ఇమిగ్రేషన్ స్టాటస్ చేంజ్ చేసుకునేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు సమాచారం.

Advertisement

Next Story

Most Viewed