- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Trump-India: ప్రతీకారం తప్పదు.. భారత్ విధించే టారీఫ్ లపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు
దిశ, నేషనల్ బ్యూరో: అమెరికా తదుపరి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) మరోసారి టారీఫ్ ల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ (India) అమెరికాపై విధించే ‘సుంకాల’ అంశాన్ని ప్రస్తావించారు. అమెరికా ఉత్పత్తులపై భారత్ అత్యధిక టారీఫ్‌లు వసూలు చేస్తోందని ఆరోపించారు. దీనికి ప్రతీకార పన్ను తప్పదంటూ వార్నింగ్ ఇచ్చారు. ఫ్లోరిడాలోని తన ఎస్టేట్‌లో ట్రంప్ మీడియాతో మాట్లాడారు. ‘‘అమెరికా ఉత్పత్తులపై భారత్, బ్రెజిల్ వంటి దేశాలు అత్యధిక టారీఫ్‌లు (Tariffs) విధిస్తున్నాయి. 100, 200శాతం పన్నులు వేస్తున్నాయి. దేనికైనా ప్రతిచర్య ఉంటుంది. వాళ్లు మాపై పన్నులు విధిస్తే మేమూ అంతేస్థాయిలో పన్నులు వసూలు చేస్తాం. ఒకవేళ భారత్ వందశాతం పన్నులు విధిస్తే మేము వారిపై అలాగే ఛార్జ్ చేయకూడదా? అలా టారీఫ్ లు వసూలు చేయడం ఆయా దేశాల ఇష్టం. కానీ, మేం కూడా అలాగే ప్రతిస్పందిస్తాం’’ అని ట్రంప్ (Trump on Taxes) వివరించారు. చైనాతో వాణిజ్య ఒప్పందంపై ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అమెరికా ఉత్పత్తులపై అధిక సుంకాలు విధిస్తున్న దేశాల్లో భారత్, బ్రెజిల్ కూడా ఉన్నాయని ట్రంప్ అన్నారు.
ట్రంప్ కార్యదర్శి వ్యాఖ్యలు
మరోవైపు, ట్రంప్ వాణిజ్య కార్యదర్శి పిక్ హోవార్డ్ లుట్నిక్ కూడా టారీఫ్ లపై స్పందించారు. "పరస్పరత" అనేది ట్రంప్ పరిపాలనకు కీలకమైన అంశం అని అన్నారు. "మీరు మాతో ఎలా ప్రవర్తిస్తారో అదే విధంగా మీతో మేం ప్రవర్తిస్తామని గుర్తుంచుకోవాలి" అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అధ్యక్ష ఎన్నికలకు ముందు కూడా ట్రంప్ పలుమార్లు సుంకాల అంశంపై ఇదేతరహా వ్యాఖ్యలు చేశారు. తాను అధికారంలోకి వచ్చిన తర్వాత భారత్, చైనా, బ్రెజిల్ వంటి దేశాలపై అత్యధిక సుంకాలు విధిస్తానని గతంలోనూ హెచ్చరించారు.