Trump : డెమొక్రాట్లకు ఆర్థిక సాయం చేయండి.. తన మద్దతు దారులకు ట్రంప్ విజ్ఞప్తి

by vinod kumar |
Trump : డెమొక్రాట్లకు ఆర్థిక సాయం చేయండి.. తన మద్దతు దారులకు ట్రంప్ విజ్ఞప్తి
X

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హ్యారీస్‌ (Kamala hyarees)పై రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) విజయం సాధించిన విషయం తెలిసిందే. గెలుపు అనంతరం కూడా ఆ పార్టీపై ట్రంప్ విరుచుకుపడుతూనే ఉన్నాడు. తాజాగా డెమొక్రాట్లను ఉద్దేశించి ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఎన్నికల తర్వాత డెమొక్రాట్లు ఆర్థిక ఇబ్బందులు ఎదరుర్కొంటున్నారని వారికి సహాయం చేయాలని తన మద్దతు దారులకు విజ్ఞప్తి చేశారు. ఆ పార్టీ ఎన్నికల్లో చాలా డబ్బు ఖర్చు చేసిందని, ఇప్పుడు తమ ఉద్యోగులకు చెల్లించడానికి కూడా వారి వద్ద డబ్బు లేదని పేర్కొన్నారు. ‘2020 అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాట్లు రికార్డు స్థాయిలో డబ్బు సేకరించారు. గొప్పగా పోరాడి విజయం సాధించారు. కానీ ఇప్పడు వారి వద్ద ఒక్క డాలర్ కూడా లేకపోవడం ఆశ్చర్యంగా ఉంది. డెమొక్రటిక్ పార్టీ కష్ట సమయాల్లోనూ సహాయం చేయాలి. పార్టీలుగా మనమంతా ఐక్యంగా ఉండాలి. కాబట్టి వారికి సహాయం చేయండి. ప్రచార సమయంలో మా అతిపెద్ద ఆస్తి మీడియా. కాబట్టి మాకు ఇంకా చాలా డబ్బు మిగిలి ఉంది. మేము పెద్దగా డబ్బు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు’ అని పేర్కొన్నారు. కాగా, ఎన్నికల్లో కమలా హ్యారీస్ భారీగా డబ్బు ఖర్చు చేసిందని పలు నివేదికలు వెల్లడించిన నేపథ్యంలో ట్రంప్ వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.

Advertisement

Next Story

Most Viewed