ఫోన్ లిఫ్ట్ చేస్తే పోర్న్ వీడియో ప్లే అయింది.. త్రిపుర బీజేపీ ఎమ్మెల్యే వివరణ

by Javid Pasha |
ఫోన్ లిఫ్ట్ చేస్తే పోర్న్ వీడియో ప్లే అయింది.. త్రిపుర బీజేపీ ఎమ్మెల్యే వివరణ
X

దిశ, వెబ్ డెస్క్: త్రిపుర అసెంబ్లీ సమావేశాల్లో జాదవ్ లాల్ నాథ్ అనే ఓ బీజేపీ ఎమ్మెల్యే సెల్ ఫోన్ లో పోర్న్ వీడియో చూస్తున్న వీడియో వైరల్ అయిన విషయం తెలిసిందే. దీంతో దేశవ్యాప్తంగా సదరు ఎమ్మెల్యేపై విమర్శలు వెల్లువెత్తాయి. ప్రజల సంక్షేమ కోసం చట్టాలు చేసే పవిత్రమైన అసెంబ్లీలో ఆ పాడు పనులు ఏంటీ అంటూ నెటిజన్లు దుమ్మెత్తిపోశారు. వెంటనే రాజీనామా చేయాలని, ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి.

అయితే ఎమ్మెల్యే జాదవ్ లాల్ నాథ్ పోర్న్ వీడియోపై స్పందించారు. తాను అసెంబ్లీలో ఉండగా ఫోన్ వచ్చిందని, ఆ ఫోన్ లిఫ్ట్ చేస్తే పోర్న్ వీడియో ప్లే అయిందని తెలిపారు. ఆ వీడియోను ఎంత కట్ చేద్దామని ప్రయత్నించినా కుదరలేదని చెప్పారు. తాను అలాంటి పనులు చేసే వ్యక్తిని కాదని, అలా ఎందుకు జరిగిందో అర్థం కావడం లేదని అన్నారు.

Advertisement

Next Story