Trinamool congress: మహిళా అధికారితో అనుచిత ప్రవర్తన.. చిక్కుల్లో బెంగాల్ మంత్రి

by vinod kumar |
Trinamool congress: మహిళా అధికారితో అనుచిత ప్రవర్తన.. చిక్కుల్లో బెంగాల్ మంత్రి
X

దిశ, నేషనల్ బ్యూరో: పశ్చిమ బెంగాల్ మంత్రి, తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) నేత అఖిల్ గిరి వివాదంలో చిక్కుకున్నారు. ఆయన మహిళా అధికారితో అనుచితంగా ప్రవర్తించిన ఓ వీడియోను బీజేపీ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ వీడియోలో అఖిల్ మహిళా అటవీ అధికారి మనీష్ షాపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. ‘నువ్వు ప్రభుత్వ ఉద్యోగివి. తల వంచుకుని నాతో మాట్లాడు. ఒక వారంలో ఏం జరుగుతుందో చూస్తారు. ఇంటికి కూడా వెళ్లనివ్వం’ అని వార్నింగ్ ఇస్తూ కనిపించారు. అయితే ఈ వీడియో ఎప్పుడు చిత్రికరించారనే విషయం వెల్లడికాలేదు. ఈ వీడియో వైరల్‌గా మారడంతో మంత్రి అఖిల్‌పై పలువురు విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలోనే టీఎంసీ సైతం తీవ్రంగా స్పందించింది.

అఖిల్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది. మహిళా అధికారికి క్షమాపణలు చెప్పడంతో పాటు పదవికి, పార్టీకి రాజీనామా చేయాలని సూచించింది. పార్టీ రాష్ట్ర చీఫ్ సుబ్రతా బక్షి అఖిల్ గిరితో మాట్లాడి పార్టీ నిర్ణయాలను ఆయనకు వివరించారు. పార్టీ అధికార ప్రతినిధి డాక్టర్ శాంతన్ సేన్ మాట్లాడుతూ..‘టీఎంసీ మంత్రి అఖిల్ గిరి ఒక మహిళా అటవీ అధికారితో అనుచితంగా ప్రవర్తించారు. అలాంటి ప్రవర్తనను సమర్థించబోము. అఖిల్ ను పదవికి రాజీనామా చేయాలని ఆదేశించాం’ అని వ్యాఖ్యానించారు. మరోవైపు బీజేపీ సైతం స్పందించింది.అఖిల్‌ను మంత్రివర్గం నుంచి తొలగించి జైలుకు పంపాలని డిమాండ్ చేసింది.

Advertisement

Next Story

Most Viewed