‘ఈడీ’పై గిరిజనుల ఆగ్రహం: కాంగ్రెస్ నేత కీలక వ్యాఖ్యలు

by samatah |
‘ఈడీ’పై  గిరిజనుల ఆగ్రహం: కాంగ్రెస్ నేత కీలక వ్యాఖ్యలు
X

దిశ, నేషనల్ బ్యూరో: జార్ఖండ్ రాష్ట్రంలోని గిరిజనులు ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)పై ఆగ్రహంతో ఉన్నారని ఆ రాష్ట్ర కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ బంధు టిర్కీ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఎన్నికైన ప్రభుత్వాలను సవాల్ చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. సీఎం గిరిజన బిడ్డ అయినందుకే ఆయనను పదే పదే వేధిస్తున్నారని విమర్శించారు. గిరిజనులకు కోపం వచ్చినప్పుడు..రాళ్లను పగులగొట్టే సాంప్రదాయ గిరిజన సాధనం ధల్-ముగ్దాను వారి ఇళ్ల నుంచి బయటకు తీసుకువస్తారన్నారు. అలాంటి సమయంలో ఈడీ ఇబ్బంది పడక తప్పదని వార్నింగ్ ఇచ్చారు. భూ కుంభకోణం కేసులో ఈడీ సీఎం హేమంత్ సొరేన్‌కు సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే టిర్కీ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అయితే టిర్కీ వ్యాఖ్యలపై జార్ఖండ్ అధికార పార్టీ(జేఎంఎం) స్పందించింది. టిర్కి వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగత అభిప్రాయామని తెలిపింది. కానీ ఈడీతో సీఎంను బెదిరింపులకు గురి చేయడం మాత్రం గిరిజనులకు కోపం తెప్పిస్తుందని పేర్కొంది.

Advertisement

Next Story