Train Accedent: రెండుగా విడిపోయిన ఎక్స్ ప్రెస్ రైలు.. తప్పిన పెను ప్రమాదం

by Ramesh Goud |
Train Accedent: రెండుగా విడిపోయిన ఎక్స్ ప్రెస్ రైలు.. తప్పిన పెను ప్రమాదం
X

దిశ, డైనమిక్ బ్యూరో: కప్లింగ్ తెగిపోవడంతో సంపర్క్ క్రాంతి ఎక్స్ ప్రెస్ రైలు రెండుగా విడిపోయింది. అధికారుల అప్రమత్తతో భారీ ప్రమాదం తప్పినట్టు అయ్యింది. బీహార్‌లోని దర్భంగా నుంచి న్యూఢిల్లీకి వెళ్తున్న బీహార్ సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ సోమవారం ప్రమాదానికి గురైంది. సమస్తిపూర్-ముజఫర్‌పూర్ రైల్వే సెక్షన్‌లోని పూసా స్టేషన్ సమీపంలో ఇంజిన్, కోచ్ లను కలిపే కప్లింగ్ విరిగిపోవడంతో రైలు రెండు బాగాలుగా విడిపోయింది. విషయాన్ని గమణించిన లోకో పైలట్ ఎమర్జెన్సీ బ్రేకులు వేసి రైలు ఇంజిన్ ను నిలిపివేశాడు. అకస్మాత్తుగా రైలు ఆగిపోవడంతో విషయం తెలుసుకున్న ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న సోన్‌పూర్ డివిజన్ అధికారులు దీని తర్వాత వచ్చే రైళ్లను తక్షణమే నిలిపివేయాలని ఆదేశాలు ఇచ్చారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పినట్టు అయ్యింది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరిగలేదని రైల్వే అధికారులు తెలిపారు. దీనిపై సోన్‌పూర్ రైల్వే డివిజన్ కార్యాలయానికి సమాచారం అందించడంతో.. రైల్వే ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి చేరుకుని రైలు కోచ్‌ను కనెక్ట్ చేశారు. అనంతరం రైలు ఢిల్లీకి బయలుదేరిందని రైల్వే ఉన్నతాధికారులు వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed