హీరో పుట్టిన రోజు సందర్భంగా విషాదం: విద్యుత్ షాక్‌తో ముగ్గురు అభిమానుల మృతి

by samatah |   ( Updated:2024-01-08 05:00:49.0  )
హీరో పుట్టిన రోజు సందర్భంగా విషాదం: విద్యుత్ షాక్‌తో ముగ్గురు అభిమానుల మృతి
X

దిశ, నేషనల్ బ్యూరో: కన్నడ నటుడు యశ్‌ జన్మదినం సందర్భంగా విషాదం చోటు చేసుకుంది. యశ్ బ్యానర్ విద్యుత్ స్తంభానికి కడుతుండగా కరెంట్ షాక్‌తో ముగ్గురు అభిమానులు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ముగ్గురు గాయపడ్డారు. కర్ణాటక రాష్ట్రంలోని గడగ్ జిల్లా లక్ష్మేశ్వర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సురంగి గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మరణించిన వారిని మురళీ నడవినమణి (20), హనమంత హరిజన్ (21), నవీన్ ఘాజీ (19)లుగా గుర్తించారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. కాగా. జవనరి 8 1986లో జన్మించిన యశ్ కన్నడ చిత్ర పరిశ్రమలో ప్రముఖ నటుడు. 2007లో ‘జంబడ హుడుగి’తో తెరంగేట్రం చేశాడు. రాకీ, గూగ్లీ, మిస్టర్ వంటి సినిమాల్లో నటించాడు.

Advertisement

Next Story