- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Top LeT terrorist: మోస్ట్ వాంటెడ్ లష్కరే తోయిబా టెర్రరిస్టు హతం..!

దిశ, నేషనల్ బ్యూరో: లష్కరే తోయిబాకు (Lashkar-e-Taiba) చెందిన మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ (most wanted terrorist) అబు ఖతల్ (Abu Qatal) హతమయ్యాడు. శనివారం రాత్రి పాక్ లో హత్యకు గురయ్యాడు. తన గార్జులతో కలిసి జీలం ప్రాంతంలో ప్రయాణిస్తుంగా.. గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. దుండగులు 15 నుంచి 20 రౌండ్లు కాల్పులు జరపడంతో అబు ఖతల్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అతడితోపాటు తన భద్రతా గార్డు కూడా ప్రాణాలు కోల్పోగా.. మరో గార్డుకు గాయాలైనట్లు సమాచారం. మరోవైపు, అబు ఖతల్ కు పాక్ సైన్యం రక్షణ కల్పిస్తోంది.
ఎల్ఈటీలో కీలక పాత్ర
లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థలో అబు ఖతల్ కీలక వ్యక్తిగా ఉన్నాడు. జమ్మూకశ్మీర్‌లో చోటుచేసుకున్న పలు దాడుల్లో ఇతడి హస్తం ఉంది. అంతేకాదు, 26/11 ముంబై ఉగ్రదాడుల సూత్రధారి హఫీజ్ సయూద్‌కు అత్యంత సన్నిహితుడు. అతడే అబుని.. లష్కర్ చీఫ్ ఆపరేషనల్ కమాండర్‌గా నియమించాడు. గతేడాది జూన్ 9న జమ్ముకశ్మీర్ రియాసీ జిల్లాలోని శివఖోరి ఆలయం నుంచి భక్తులతో వస్తున్న బస్సుపై జరిగి ఉగ్రదాడిలో అబు ఖతల్ కీలక పాత్ర పోషించాడు. అతడి నేతృత్వంలో ఈ దాడికి పథక రచన జరిగింది. అంతేకాకుండా, 2023 రాజౌరి దాడిలో అబు పాత్ర ఉందని జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) తన చార్జిషీట్‌లో పేర్కొంది.