నేడు యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్‌ పుట్టినరోజు

by Prasanna |
నేడు యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్‌ పుట్టినరోజు
X

దిశ, ఫీచర్స్ : 38 ఏళ్ల వయస్సు లోనే దేశంలోనే అతి పెద్ద రాష్ట్రానికి, అతి చిన్న వయసు ఉన్న ముఖ్యమంత్రిగా నిలిచిన అఖిలేష్ యాదవ్ ఐదు ఏళ్లలోనే పదవిని పోగొట్టుకున్నారు. 2017 లో బీజేపీ ప్రభంజనంతో అఖిలేష్ యాదవ్ తన పదవిని కోల్పోయాడు. 2022 అసెంబ్లీ గెలుపు కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేసాడు. 1 జూలై 1973న ఉత్తరప్రదేశ్‌లోని ఇటావా జిల్లాలోని సైఫాయ్‌లో జన్మించారు. మాల్తీ దేవి, ములాయం సింగ్ యాదవ్ దంపతులకు జన్మించాడు. అతను 2000 ఉప ఎన్నికలో కన్నౌజ్ నుండి 13వ లోక్‌సభకు ఎన్నికయ్యారు. మార్చి 2012లో ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ నాయకుడిగా నియమితులయ్యారు. అతను 38 సంవత్సరాల వయస్సులో 15 మార్చి 2012న ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యాడు. నేడు ఆయన 51 వ పుట్టిన రోజును జరుపుకుంటున్నాడు.

Next Story

Most Viewed