M. K. Stalin : తమిళనాడు గవర్నర్‌కు సీఎం స్టాలిన్ షాక్

by Harish |   ( Updated:2023-11-18 11:43:39.0  )
M. K. Stalin : తమిళనాడు గవర్నర్‌కు సీఎం స్టాలిన్ షాక్
X

చెన్నై: గవర్నర్ ఆర్ఎన్ రవి ఆమోదించకుండా వెనక్కి పంపిన 10 బిల్లులను తమిళనాడు అసెంబ్లీ శనివారం మరోసారి ఆమోదించింది. ఈ స్పెషల్ సెషన్‌లో స్వయంగా సీఎం ఎంకే స్టాలిన్.. ఆ బిల్లులను తిరిగి సభలో ప్రవేశపెట్టారు. దీంతో అసెంబ్లీ వాటిని ఆమోదిస్తూ తీర్మానం చేసింది. అనంతరం ఆ బిల్లులను మరోసారి గవర్నర్ వద్దకు పంపారు. ఇక ఈ సెషన్ నుంచి విపక్ష అన్నాడీఎంకే, బీజేపీ ఎమ్మెల్యేలు వాకౌట్ చేశారు.

ఈ సందర్భంగా అసెంబ్లీలో సీఎం స్టాలిన్ మాట్లాడుతూ.. ప్రజా ప్రతినిధులతో కూడిన అసెంబ్లీ ఆమోదించిన బిల్లులకు ఆమోదం తెలపడం గవర్నర్ విధి అన్నారు. ఆయనకు ఏవైనా అభ్యంతరాలు ఉంటే ప్రభుత్వానికి తెలియజేయవచ్చని సూచించారు. గతంలో కొన్ని బిల్లుల గురించి గవర్నర్ ప్రశ్నలు లేవనెత్తినప్పుడు ప్రభుత్వం వెంటనే స్పందించిందని స్టాలిన్ గుర్తుచేశారు.

గవర్నర్‌ కోరిన వాటికి ప్రభుత్వం వివరణ ఇవ్వని సందర్భం ఎప్పుడూ లేదన్నారు. 10 బిల్లులకు గవర్నర్ అనుమతి నిలుపుదల చేయడం తమిళనాడు ప్రజలను అవమానించడమే అని వ్యాఖ్యానించారు. గవర్నర్ రాష్ట్ర ప్రజలకు, ప్రజాస్వామ్యానికి, చట్టానికి, మనస్సాక్షికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు.

Advertisement

Next Story