West Bengal: మరోసారి దీదీకి మద్దతుగా నిలిచిన శతృఘ్న సిన్హా

by S Gopi |
West Bengal: మరోసారి దీదీకి మద్దతుగా నిలిచిన శతృఘ్న సిన్హా
X

దిశ, నేషనల్ బ్యూరో: కోల్‌కతాలోని ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో ట్రెయినీ డాక్టర్‌పై జరిగిన దారుణమైన అత్యాచారం, హత్యపై నిరసనల మధ్య తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ శతృఘ్న సిన్హా మరోసారి తన పార్టీ అధినేత్రి మమతా బెనర్జీకి మద్దతు తెలిపారు. ఆదివారం జాతీయ మీడియాతో మాట్లాడిన ఆయన.. ఈ నేరానికి ముఖ్యమంత్రిని నిందించడం అన్యాయం. డాక్టర్ల నిరసనలకు నేను కూడా మద్దతు ఇచ్చాను, అదే సమయంలో, మమతాజీ తీసుకువచ్చిన అత్యాచార నిరోధక బిల్లు చారిత్రాత్మకమైనది. ఈ కేసులో మమతనే కాదు ఏ ముఖ్యమంత్రిని నిందించినా అన్యాయమే అవుతుంది. ఈ ఘటన చాలా షాకింగ్ కలిగించింది. అయితే దీన్ని రాజకీయం చేస్తున్న తీరు విచారకరంగా ఉంది. నేను మమతా జీతో ఉన్నాను. మమతా జీకి సైనికుడిగా వెంట నిలుస్తాను. ఈ సమస్యపై భవిష్యత్తులో కూడా మద్దతిస్తాను ' అని సిన్హా చెప్పారు. అత్యాచార నిరోధక బిల్లుకు మద్దతు ఇవ్వాలని, వీలైనంత త్వరగా ఆమోదించాలని నేను గవర్నర్‌తో పాటు కేంద్రానికి విజ్ఞప్తి చేస్తాను. సీఎం మమత రాజీనామా అడగడం సరికాదు. ఇదే పరమావధి అయితే, ప్రధాని కూడా రాజీనామా చేయాల్సి ఉంటుంది. మణిపూర్, హత్రాస్, ఉన్నావ్, కథువా వంటి సమస్యలపై రాజీనామా చేయాలని అన్నారు.

Advertisement

Next Story

Most Viewed