ఉగ్రవాదులకు టీఎంసీ ఆశ్రయం కల్పిస్తోంది: కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్

by samatah |
ఉగ్రవాదులకు టీఎంసీ ఆశ్రయం కల్పిస్తోంది: కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్
X

దిశ, నేషనల్ బ్యూరో: పశ్చిమ బెంగాల్‌లో అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) దేశ వ్యతిరేక శక్తులకు ఆశ్రయం కల్పిస్తోందని, అంతేగాక మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడే వారికి మద్దతిస్తోందని కేంద్ర కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ ఆరోపించారు. రాష్ట్రంలోని సిలిగురిలో ఎన్నికల ప్రచారం సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. దేశంలో ఎక్కడ ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడినా వారికి బెంగాల్‌లో ఎందుకు ఆశ్రయం లభిస్తోందని ప్రశ్నించారు. మమతా బెనర్జీ హయాంలో రాష్ట్రంలో అవినీతి పెరిగిపోయిందని విమర్శించారు. మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్న పట్టించుకోలేదని మండిపడ్దారు.

బెంగళూరులోని రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో ప్రధాన సూత్రధారితో సహా ఇద్దరు కీలక నిందితులను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) ఇటీవల పశ్చిమ బెంగాల్‌లో అరెస్టు చేసింది.ఈ పరిణామంతో బీజేపీ, టీఎంసీ మధ్య మాటల యుద్ధం నడిచింది. ఈ క్రమంలోనే అనురాగ్ ఠాకూర్ వ్యాఖ్యలు చేశారు.ఠాకూర్ ఆరోపణలపై టీఎంసీ స్పందించింది. బీజేపీ ప్రజల్లో భ్రమలు కల్పంచడానికి ప్రయత్నిస్తున్నట్టు స్పష్టంగా అర్థమవుతోందని తెలిపింది. బీజేపీకి వాస్తవాలు తెలియవని పేర్కొంది. రాష్ట్ర పోలీసుల సత్వర చర్య వల్లే నిందితులను నిందితులను అరెస్టు చేయగలిగారని వెల్లడించింది. పశ్చిమ బెంగాల్‌కు చెల్లించాల్సిన రూ.1.6 లక్షల కోట్ల బకాయిలను కేంద్ర ప్రభుత్వం నిలిపివేసిందని, దమ్ముంటే దీనిపై మాట్లాడాలని సవాల్ విసిరింది.

Advertisement

Next Story