Delhi : కాళ్లు మొక్కి చంపేశారు.. దీపావళి వేళ ఢిల్లీలో షాకింగ్ ఘటన వైరల్

by Ramesh N |
Delhi : కాళ్లు మొక్కి చంపేశారు.. దీపావళి వేళ ఢిల్లీలో షాకింగ్ ఘటన వైరల్
X

దిశ, డైనమిక్ బ్యూరో: దీపావళి Diwali పండుగ వేళ దేశ రాజధాని ఢిల్లీలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. కుటుంబమంతా కలిసి సంబరాలు చేసుకుంటుండగా దుండగులు బైక్‌పై వచ్చి కాళ్లు మొక్కి మరి వ్యక్తిపై కాల్పులకు పాల్పడ్డారు. ఈశాన్య Delhi ఢిల్లీలోని బిహారీ కాలనీలో గురువారం రాత్రి తమ ఇంటి వద్ద 44 ఏళ్ల వ్యక్తి ఆకాశ్ శర్మ, అతడి మేనల్లుడు రిషబ్ శర్మ టపాసులు కాలుస్తుండగా స్కూటీపై ఇద్దరు దుండగులు వారి వద్దకు వచ్చి ఆగుతారు. అందులో టీనేజర్ పెద్దాయన కాళ్లు మొక్కి ఆశీర్వాదం తీసుకుంటాడు. ఇంకో వ్యక్తి వెంటనే తుపాకీతో పెద్దాయన ఆకాశ్ శర్మను కాల్చి ఇద్దరు పారిపోతారు. వెంటనే వారిని పట్టుకునేందుకు వెళ్లిన మేనల్లుడు రిషబ్‌పై కూడా దుండగులు కాల్పులు జరుపుతారు. ఈ ఘటనలో ఆకాశ్ శర్మ(44), మేనల్లుడు రిషబ్ వర్మ(16) మరణించగా.. మరోకరు గాయపడ్డారు.

దీనికి సంబంధించిన సీసీ ఓ వీడియో రికార్డు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఘటనపై విచారణ జరిపిన పోలీసులు స్కూటీపై వచ్చిన టీనేజర్ (16), బాధిత కుటుంబానికి మధ్య అప్పు వివాదం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే టీనేజర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరోవ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Advertisement

Next Story