Akhilesh yadav: ఓటర్లను బీజేపీ గౌరవించట్లేదు.. అఖిలేష్ యాదవ్ ఘాటు వ్యాఖ్యలు

by Shamantha N |
Akhilesh yadav: ఓటర్లను బీజేపీ గౌరవించట్లేదు.. అఖిలేష్ యాదవ్ ఘాటు వ్యాఖ్యలు
X

దిశ, నేషనల్ బ్యూరో: సంభాల్ హింసపై(Sambhal Violence) సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్(Akhilesh Yadav) కీలక వ్యాఖ్యలు చేశారు. మసీదులున్న చోట దేవాలయాలున్నాయని చూస్తున్న వారు శాంతిని కోరుకోవట్లేదని బీజేపీని ఉద్దేశించి చురకలు అంటించారు. లోక్‌సభలో రాజ్యాంగంపై చర్చ సందర్భంగా అఖిలేష్ ఈ వ్యాఖ్యలు చేశారు. భారతీయ ఓటర్లను బీజేపీ గౌరవించదని అన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని ఓటర్లను లోక్‌సభ ఎన్నికల్లో ఓటు వేయడానికి అనుమతించలేదని, వారిని పోలీసులు అడ్డుకున్నారని ఆరోపించారు. దేశాన్ని సురక్షితంగా, ఐక్యంగా రాజ్యాంగమే ఉంచిందన్నారు. రాజ్యాంగం ప్రజాస్వామ్యానికి ఆత్మ అని సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ అన్నారు. సరిహద్దుల్లో భద్రత, ఆర్థిక వ్యవస్థ, పౌరుల అంతర్గత భద్రతపై సందేహాలు లేవనెత్తారు. చైనా ఆక్రమణలను ప్రస్తావిస్తూ.. భారతదేశ సరిహద్దులు కుంచించుకుపోతున్నాయని అన్నారు.

మోడీ లేకుండా చర్చలా?

‘సభలో ప్రధాని మోడీ లేకుండా రాజ్యాంగంపై చర్చలా?’ అని అఖిలేశ్‌ యాదవ్‌ (Akhilesh Yadav) ఫైర్ అయ్యారు. ఎన్డీయే హయాంలో వేలాది మంది సామాన్యులు దేశం విడిచి వెళ్లిపోయారని అన్నారు. చాలా మంది భారత పౌరసత్వాన్ని వదులుకున్నారని చెప్పారు. ఎన్డీయే ప్రభుత్వం నియంత పాలన సాగిస్తోందని నిప్పులు చెరిగారు. దేశంలోని 20 కోట్ల మంది మైనారిటీలను, ముఖ్యంగా ముస్లింలను ద్వితీయ శ్రేణి పౌరులుగా మార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని అఖిలేష్ ఆరోపంచారు. కులగణన కులాల మధ్య అంతరాన్ని దూరం చేస్తుందన్నారు. కచ్చితంగా కులగణన నిర్వహిస్తామన్నారు.

Advertisement

Next Story

Most Viewed