భారతదేశ చరిత్రలో ఇదే మొదటి సారి: సీఎం సిద్ధరామయ్య

by samatah |
భారతదేశ చరిత్రలో ఇదే మొదటి సారి: సీఎం సిద్ధరామయ్య
X

దిశ, నేషనల్ బ్యూరో: కర్ణాటకకు కరువు సహాయ నిధిని విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించిందని ఆ రాష్ట్ర సీఎం సిద్ధరామయ్య వెల్లడించారు. సుప్రీంకోర్టు జోక్యంతో విపత్తు నివారణకు నిధులు విడుదల చేసేందుకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ అంగీకరించిందని దీంతో రాష్ట్రానికి కరువు సాయం కింద రూ.3,498.82 కోట్లు అందనున్నాయని తెలిపారు. ఈ మేరకు శనివారం ఎక్స్‌లో పోస్టు చేశారు. ఒక రాష్ట్రం తన హక్కులను అమలు చేయడానికి సుప్రీంకోర్టుకు వెళ్లడం భారతదేశ చరిత్రలో ఇదే మొదటిసారి అని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు మందలించిన తర్వాతే హోం మంత్రి మేల్కొన్నారని వెల్లడించారు. అత్యున్నత న్యాయస్థానానికి ధన్యవాదాలు తెలిపారు. కానీ కేంద్రం ఇచ్చే నిధులు ఏ మాత్రం సరిపోవని, రాష్ట్ర ప్రభుత్వం రూ.18000కోట్లు అడిగిందని పేర్కొన్నారు. కాగా, నీటి సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు జాతీయ విపత్తు ప్రతిస్పందన నిధి నుంచి నిధులు విడుదల చేసేందుకు కేంద్రాన్ని ఆదేశించాలని కర్ణాటక ప్రభుత్వం ఈ ఏడాది మార్చిలో సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీంతో దీనిపై విచారణ చేపట్టి కోర్టు కేంద్రానికి ఆదేశాలు జారీ చేసింది.

Advertisement

Next Story