- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇవే నా చివరి ఎన్నికలు.. మాజీ సీఎం సిద్ధరామయ్య సంచలన ప్రకటన
దిశ, డైనమిక్ బ్యూరో: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. కర్నాటక మాజీ సీఎం సిద్ధరామయ్య ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ పూర్తి మెజారిటీ సాధిస్తుందని సిద్ధరామయ్య ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌కు 130 నుంచి 150 సీట్లు వచ్చే అవకాశం ఉందన్నారు. పని చేసే పార్టీనే ఎన్నుకోవాలని ఓటర్లను కోరిన సిద్దరామయ్య ఈ ఎన్నికలపైనే దేశ భవిష్యత్తు ఆధారపడి ఉందని అన్నారు.
ఓటర్ల నుంచి అద్భుతమైన స్పందన ఉందని, తనకు 60% కంటే ఎక్కువ ఓట్లు వస్తాయని సిద్ధరామయ్య తెలిపారు. కర్ణాటకలో కాంగ్రెస్ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు.. తాను రిటైర్మెంట్ తీసుకోనని, వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని స్పష్టం చేశారు. ఇదే తన చివరి ఎన్నికలని సిద్ధరామయ్య పేర్కొన్నారు. పని చేసే పార్టీకే ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థించారు.