ఇవి ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని రక్షించే ఎన్నికలు : ఓటర్లకు రాహుల్ గాంధీ విజ్ఞప్తి

by Dishanational1 |
ఇవి ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని రక్షించే ఎన్నికలు : ఓటర్లకు రాహుల్ గాంధీ విజ్ఞప్తి
X

దిశ, నేషనల్ బ్యూరో: లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి రెండో దశ పోలింగ్ సందర్భంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఓటర్లకు కీలక సందేశం ఇచ్చారు. పోలింగ్ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. ఇవి భారత రాజ్యాంగం, ప్రజాస్వామ్యాన్ని రక్షించేందుకు జరుగుతున్న ఎన్నికలని, ప్రజలు ప్రజాస్వామ్యం పట్ల బాధ్యతను నిర్వర్తించాలని ఎక్స్‌లో వీడియో ట్వీట్ ద్వారా పిలుపునిచ్చారు. ఓవైపు ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని ధ్వంసం చేసేందుకు బీజేపీ, ఆరెస్సెస్ ప్రయత్నిస్తున్నాయని, మరోవైపు కాంగ్రెస్ పార్టీ, ఇండియా కూటమి రాజ్యాంగ పరిరక్షణకు శ్రమిస్తున్నాయని రాహుల్ గాంధీ వీడియోలో తెలిపారు. తాము ప్రజల సమస్యలు, ఇబ్బందులను తెలుసుకుని వాటిని మేనిఫెస్టోలో పొందుపరిచాం. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పాదయాత్ర చేసి మణిపూర్ నుంచి మహారాష్ట్ర వరకు పర్యటించానని పేర్కొన్నారు. తమ మేనిఫెస్టోలో ఐదు ప్రధాన గ్యారెంటీలను అందించాం. నరేంద్ర మోడీ దేశానికి 22-25 మంది మిలియనీర్లను తయారు చేస్తే తాము కోట్లాది మహిళలు, యువతను లక్షాధికారులుగా మారుస్తామని, రైతులకు కనీస మద్దతు ధర అందిస్తామని హామీ ఇచ్చారు. తమది విప్లవాత్మక మేనిఫెస్టో అని రాహుల్ గాందీ వెల్లడించారు.



Next Story

Most Viewed