కేంద్రంలో దోపిడీదారుల ప్రభుత్వం : మమతా బెనర్జీ

by Hajipasha |
కేంద్రంలో దోపిడీదారుల ప్రభుత్వం : మమతా బెనర్జీ
X

దిశ, నేషనల్ బ్యూరో : బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బీజేపీని చీల్చిచెండాడారు. కేంద్రంలో అల్లరిమూకలు, దొంగలు, దోపిడీదారుల ప్రభుత్వం నడుస్తోందని ఆమె ఆరోపించారు. మణిపూర్ పక్కనే ఉన్న అసోంలోని సిల్చార్‌లో తమ పార్టీ (తృణమూల్ కాంగ్రెస్) అభ్యర్థి తరపున బుధవారం దీదీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ‘‘మణిపూర్‌లో హింసాకాండ జరుగుతుంటే మౌనంగా కూర్చుండిపోయిన ప్రధాని మోడీ.. మీకు మాత్రం న్యాయం చేస్తారని ఎలా అనుకుంటున్నారు ?’’ అని సభకు హాజరైన ప్రజలను మమత ప్రశ్నించారు. సిల్చార్ నుంచి తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ ఎంపీ రాధేశ్యామ్ బిశ్వాస్ పోటీ చేస్తున్నారు. 1990వ దశకం వరకు ఈ సీటు కాంగ్రెస్ కంచుకోటగా ఉండేది. ఆతర్వాతి నుంచి ఆల్టర్నేటివ్‌గా కొన్ని సార్లు బీజేపీ అభ్యర్థి, మరికొన్ని సార్లు కాంగ్రెస్ అభ్యర్థి గెలుస్తూ వచ్చారు

Advertisement

Next Story