షిల్లాంగ్‌లో ధూమ్మచాలే..! సినిమాను తలపించేలా చోరి..

by Ramesh N |   ( Updated:2024-06-01 14:41:44.0  )
షిల్లాంగ్‌లో ధూమ్మచాలే..! సినిమాను తలపించేలా చోరి..
X

దిశ, డైనమిక్ బ్యూరో: యాక్షన్ థ్రిల్లర్ చిత్రాల్లో ‘ధూమ్మచాలే’ అంటూ హీరోలు బైక్‌లపై వచ్చి రోడ్డుపై పొతున్న ట్రక్కుల్లో ఉండే వస్తువులను దొంగతనం చేసి ప్రేక్షకులను అలరిస్తారు. అయితే తాజాగా ఇలాంటి సంఘటననే రియల్ లైఫ్‌లో షిల్లాంగ్‌లో ఎదురైంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మేఘాలయలో రోడ్డుపై లోడ్‌తో పోతున్న మినీ ట్రక్కు లో ఇద్దరు దొంగలు సినిమా సన్నివేశాన్ని తలపించే సాహసంతో ఏదో దొంగిలిస్తున్నట్లు వీడియోలో కన్పిస్తుంటారు. వారి వెంటనే మరో ఇద్దరు దొంగలు బైక్ లపై వారిని అనుసరిస్తుంటారు.

ఇద్దరు దొంగలు కదులు తున్న ట్రక్కులో నుంచి ఏదో వస్తువులను తమ వెంట తెచ్చుకున్న బ్యాగ్‌లోకి వేస్తుంటారు. అది ఉల్లిపాయలు, బంగాళాదుంపల బస్తాలని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. అయితే ఓ బ్రిడ్జి ముందు ట్రక్కు స్లో అవ్వడంతో ఒక వ్యక్తి రన్నింగ్ లోనే ట్రక్కు దిగుతాడు. మరోవైపు ఆ బ్రిడ్జి వద్ద మరమ్మతులు జరుగుతున్న దగ్గర పోలీసు సిబ్బంది ఉన్నారు. దీంతో ఇంకో దొంగ ఆ ట్రక్‌పైనే ఉండిపోతాడు. ఇంకో దొంగ అతనిని బైక్‌పై అనుసరించడం కొనసాగిస్తాడు. అయితే షిల్లాంగ్ శివార్లలోని ఉమియామ్ హైవేపై ఓ కారులో ఉన్న వారు ఈ తతంగమంతా వీడియో రికార్డ్ చేస్తూ వారిని వెంబడిస్తారు.

Advertisement

Next Story