వేసవిలో కుక్కకాట్ల మిస్టరీ గుట్టురట్టు..

by Vinod kumar |
వేసవిలో కుక్కకాట్ల మిస్టరీ గుట్టురట్టు..
X

వాషింగ్టన్ : సమ్మర్‌లో కుక్కకాటు ఘటనలు బాగా పెరిగిపోవడానికి గల కారణాన్ని అమెరికాలోని హార్వర్డ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు గుర్తించారు. హార్వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్, హార్వర్డ్ మెడికల్ స్కూల్ పరిశోధకుల జాయింట్ టీమ్ నిర్వహించిన అధ్యయనంలో ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. మనుషులను కుక్కలు కరిచిన ఘటనలకు.. ఆయా రోజుల్లో నమోదైన టెంపరేచర్స్‌తో సంబంధం ఉందని గుర్తించారు. వాతావరణ ఉష్ణోగ్రతలు, UV రేడియేషన్ లెవల్స్, ఓజోన్ లెవల్స్ పెరిగిన రోజుల్లో కుక్క కాట్లు గణనీయంగా పెరిగాయని స్టడీలో వెల్లడైంది.

వాతావరణంలో చోటుచేసుకునే మార్పులతో, ఎండల కారణంగా భూమి బాగా వేడెక్కుతున్న రోజుల్లో కుక్కల ప్రవర్తన గతి తప్పుతోందని తేలింది. ఉష్ణోగ్రతల హీట్ ఎఫెక్ట్‌తో కుక్కలతో పాటు కోతులు, ఎలుకలు కూడా వికృత ప్రవర్తన కనబరుస్తున్నాయని పరిశోధకులు కనుగొన్నారు. ఎలుకలు పంటలు నాశనం చేయడం.. కోతులు మనుషులపై దాడులు చేయడం వంటి ఘటనలను ఆ కోవలోకే వస్తాయని స్టడీ రిపోర్ట్ లో శాస్త్రవేత్తలు ఉదహరించారు. 2009 నుంచి 2018 వరకు అమెరికాలోని ఎనిమిది నగరాల్లో నమోదైన 69,525 కుక్కకాటు కేసులు.. ఆ కేసులు నమోదైన రోజుల్లో ఉన్న టెంపరేచర్స్‌ను తులనాత్మకంగా స్టడీ చేసి, పై అంచనాకు వచ్చారు.

Advertisement

Next Story

Most Viewed