ఆ యువతి వందేభారత్ కు తొలి గిరిజన లోకో పైలట్

by Y. Venkata Narasimha Reddy |
ఆ యువతి వందేభారత్ కు తొలి గిరిజన లోకో పైలట్
X

దిశ, వెబ్ డెస్క్ : పురుషులకు ధీటుగా అన్ని రంగాల్లో రాణిస్తున్న మహిళలు రైల్వే ప్రయాణంలో సరికొత్త విప్లవాన్ని తీసుకొచ్చిన అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నడిచే వందే భారత్ రైలు లోకో పైలట్లుగా సైతం రాణిస్తు సత్తా చాటుతున్నారు. జార్ఖండ్‌లోని గిరిజన సమాజానికి చెందిన 27 ఏళ్ల రితికా టిర్కీ అనే యువతి టాటానగర్-పాట్నా వందే భారత్ ఎక్స్‌ప్రెస్ నడిపిన మొదటి గిరిజన లోకో పైలట్‌గా వార్తల్లో నిలిచింది. అంతకుముందు మహారాష్ట్రకు చెందిన సురేఖ యాదవ్ ‘వందే భారత్ ఎక్స్ప్రెస్’ రైలు నడిపిన తొలి మహిళ లోకో పైలట్ గా నిలిచారు. ఆసియాలోనూ ఈ రికార్డు ఈమె పైనే ఉంది. మహారాష్ట్రలోని సతారా సురేఖ స్వస్థలం. 1988లో తొలిసారిగా రైలు నడిపి జాతీయస్థాయిలో ఎన్నో అవార్డులు అందుకున్నారు. ఇటీవల సోలాపూర్ స్టేషన్ నుంచి చత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ వరకు సుమారు 450 కిలోమీటర్ల దూరం వందే భారత్ రైలు నడిపారు. ఆమె నడిపిన ఈ రైలు షెడ్యూల్ టైం కంటే ఐదు నిమిషాలు ముందుగా గమ్యస్థానాన్ని చేరుకోవడం విశేషం. ఈ ఘనతతో ప్రధాని మోడీ చేత సురేఖ శభాష్ అనిపించుకున్నారు. తాజాగా సురేఖ బాటలో రితికా టిర్కీ సైతం వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రెలును నడిపిన తొలి గిరిజన లోకో పైలట్ గా రికార్డు సాధించడం విశేషం.

Advertisement

Next Story

Most Viewed