Hyderabad Collector : సివిల్స్ మెయిన్స్ పరీక్షలు ప్రశాంతంగా జరిగేలా చూడాలి

by Aamani |
Hyderabad Collector : సివిల్స్ మెయిన్స్ పరీక్షలు ప్రశాంతంగా జరిగేలా చూడాలి
X

దిశ,హైదరాబాద్ బ్యూరో : యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సివిల్ సర్వీసెస్ మెయిన్స్ పరీక్షలు ప్రశాంతంగా జరిగేలా చూడాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికారులను ఆదేశించారు. కోఠి మహిళా యూనివర్సిటీ కళాశాల పరీక్షా కేంద్రాన్ని కలెక్టర్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్ష కేంద్రం లోనికి వెళ్లే ముందు కలెక్టర్ తన సెల్ ఫోన్ ను సెక్యూరిటీ పోలీసులకు అందజేశారు. పోలీసులు తనిఖీ చేసిన అనంతరం కలెక్టర్ పరీక్షా కేంద్రంలోనికి వెళ్లి పరీక్షల నిర్వహణ సరళని పరిశీలించారు. పరీక్ష కేంద్రంలో విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా త్రాగునీరు, అత్యవసర మందులు అందుబాటులో ఉంచాలని సూచించారు.

పరీక్ష కేంద్రం ముందు భద్రతా సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, ప్రతి ఒక్కరిని తనిఖీ చేసిన తర్వాత లోనికి పంపాలని, సెల్ ఫోన్ ను అనుమతించరాదని ఆదేశించారు. ఎలాంటి లోటు పాట్లకు తావు లేకుండా పరీక్షలు ప్రశాంతంగా, సజావుగా జరిగేలా చూడాలని కలెక్టర్ తెలిపారు. సివిల్ సర్వీసెస్ పరీక్షలు సెప్టెంబర్ 20,21,22,28,29 తేదీల్లో నిర్వహిస్తుంచడం జరుగుతుందని, అందులో భాగంగానే ఈ రోజు ఉదయం పేపర్ 1 ఎస్సే పరీక్షకు 707 అభ్యర్థులకు గాను 674 (95.33 శాతం) మంది హాజరైనట్లు వివరించారు . ఈ సందర్భంగా పరీక్ష కేంద్రం లోకల్ ఇన్స్పెక్టింగ్ ఆఫీసర్ బి.వెంకటేశ్వర్లు, డాక్టర్ ఎం సునీత, ఇన్విజిలేటర్లు తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed