- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సింగరేణి చరిత్రలో తొలిసారి వాళ్లకి కూడా బోనస్: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
దిశ, వెబ్‌డెస్క్: సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా కాంట్రాక్ట్ కార్మికులకు కూడా దసరా బోనస్ ఇస్తున్నామని రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు. ఈ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని వెల్లడించారు. కాగా.. సింగరేణి కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం భారీ బోనస్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ రోజు (శుక్రవారం) సెక్రటేరియట్‌లో సీఎం రేవంత్ రెడ్డితో కలిసి భట్టి విక్రమార్క ఈ విషయాన్ని ప్రకటించారు. కార్మికులకు ముందుగానే దసరా బోనస్ ఇవ్వాలని కాంగ్రెస్ సర్కార్ నిర్ణయించినట్లు పేర్కొన్నారు. 2023-24 ఏడాదిలో సింగరేణికి రూ.4,701 కోట్లు లాభం వచ్చిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఇందులో సింగరేణి కార్మికులకు రూ.796 కోట్లు బోనస్‌గా ప్రకటిస్తున్నట్లు వెల్లడించారు.
అలాగే సింగరేణి చరిత్రలోనే తొలిసారి కాంట్రాక్ట్ కార్మికులకు కూడా బోనస్ ఇవ్వాలని కాంగ్రెస్ సర్కార్ నిర్ణయించిందని, ప్రతి కార్మికుడికి రూ.5వేలు చొప్పున దసరా బోనస్ అందించనున్నామని తెలిపారు. సింగరేణి సంస్థ లాభాల్లో ఎప్పుడూ రెగ్యులర్ ఉద్యోగులకే బోనస్‌లు అందించేవాళ్లని, కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఎలాంటి బోనస్ ఉండేది కాదని పేర్కొన్న ఆయన.. ఇప్పుడు తొలిసారిగా వారికి కూడా బోనస్ ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు.