టీమిండియా మాజీ స్టార్ ప్లేయర్‌‌కు శుభవార్త చెప్పిన పోలీసులు

by GSrikanth |
టీమిండియా మాజీ స్టార్ ప్లేయర్‌‌కు శుభవార్త చెప్పిన పోలీసులు
X

దిశ, వెబ్‌డెస్క్: టీమిండియా మాజీ స్టార్ ప్లేయర్‌ సురేశ్ రైనాకు పోలీసులు శుభవార్త చెప్పారు. రైనా అత్తమామలు, బావమరిది హత్య కేసులో నిందితుడు, మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌ రషీద్ అలియాస్ చల్తా ఫిర్టా అలియాస్ సిపాహియాను ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేశారు. ముజఫర్‌నగర్‌లోని షాపుర్‌లో శనివారం సాయంత్రం రషీద్‌ను పట్టుకోడానికి పోలీసులు ప్రయత్నించగా.. అతడు కాల్పులు జరిపాడు. దీంతో ఆత్మరక్షణ కోసం పోలీసులు ఎదురుకాల్పులు జరపడంతో తీవ్రంగా గాయపడ్డాడు. అతడ్ని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించారు.

కాగా, పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌లో సురేశ్ రైనా అత్తమామలు నివాసంలో 2020 ఆగస్టు 19న నిందితుడు రషీద్‌ గ్యాంగ్ చోరీకి పాల్పడింది. ఈ సమయంలో వారిని అడ్డుకునేందుకు సురేశ్‌ రైనా మామ అశోక్‌ కుమార్‌, అత్త ఆశా, బావమరిది కౌశల్‌ కుమార్‌లు ప్రయత్నించగా.. వారిని రషీద్‌ తీవ్రంగా గాయపరిచాడు. రైనా మామ అశోక్‌ అక్కడికక్కడే మృతి చెందగా.. అత్త, బావమరిది ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన సంగతి తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed